`కన్నప్ప` హార్డ్ డ్రైవ్‌ దొంగతనం తమ్ముడు మనోజ్‌కి లింక్‌.. రఘు, చరితలపై మంచు విష్ణు సంచలన ఆరోపణలు

Published : May 30, 2025, 10:56 PM IST
manchu manoj, manchu vishnu

సారాంశం

మంచు విష్ణు నటించిన `కన్నప్ప` చిత్రానికి సంబంధించిన వీఎఫ్‌ఎక్స్ చేసిన హార్డ్ డ్రైవ్ మిస్‌ అయి విషయం తెలిసిందే. అయితే మంచు విష్ణు.. తన తమ్ముడు మనోజ్‌పై అనుమానం వ్యక్తం చేయడం షాకిస్తుంది.

మంచు విష్ణు, మంచు మోహన్‌బాబు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం `కన్నప్ప`. సుమారు రెండు వందల కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. 

ఇందులో మంచు విష్ణుతోపాటు ప్రభాస్‌, మోహన్‌లాల్‌, అక్షయ్‌ కుమార్‌ వంటి స్టార్స్ నటించడంతో సినిమాపై భారీ హైప్‌ నెలకొంది. వచ్చే నెలలో(June 27) సినిమా కూడా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో షాకిచ్చే విషయం ఇటీవల బయటకు వచ్చింది.

`కన్నప్ప` మూవీ వీఎఫ్‌ఎక్స్ హార్డ్ డ్రైవ్‌ మాయం

`కన్పప్ప` వీఎఫ్‌ఎక్స్ చేసిన కంటెంట్‌ ని ముంబయింకి చెందిన హెచ్‌ఐవీఈ స్టూడియోస్‌ సంస్థ హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో ఉన్న మంచు విష్ణు ప్రొడక్షన్‌ ఆఫీస్‌ 24 ఫ్రేమ్స్ సంస్థకి డీటీడీసీ కొరియర్‌ ద్వారా పంపించారు. 

 ఈ డ్రైవ్‌ని తీసుకుని రఘు, చరిత అనే ఇద్దరు పారిపోయారని, ఇప్పుడు కనిపించడం లేదని `కన్నప్ప` సినిమాకి సంబంధించిన ఎగ్జిక్యూటీవ్‌ ప్రొడ్యూసర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ విషయం లేట్‌గా బయటకు వచ్చింది.

తమ్ముడు మనోజ్‌పైనే అనుమానం వ్యక్తం చేసిన మంచు విష్ణు

ఈ క్రమంలో ఈ దొంగతనంపై ఇప్పటికే మంచు విష్ణు సోషల్‌ మీడియా ద్వారా స్పందించారు. ఇది పెద్ద కుట్ర అని తెలిపారు. అదే సమయంలో శివయ్యా మాకే ఎందుకు ఈ పరీక్ష అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు. 

తాజాగా దీనిపై స్పందించారు మంచు విష్ణు. `కన్నప్ప` చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ఈ విషయంపై మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. ఆఫీస్‌లో పనిచేసే రఘు, చరితనే ఈ హార్డ్ డ్రైవ్ దొంగిలించారని ఆయన స్పష్టం చేశారు.

అయితే వీరిద్దరు మంచు మనోజ్‌ ఇంట్లోనే పని చేస్తారని, వాళ్లు సొంతంగానే ఈ పని చేశారా? ఎవరైనా చెబితే చేశారా? అనేది తెలియాల్సి ఉందన్నారు. పరోక్షంగా తమ్ముడు మనోజ్‌పై మంచు విష్ణు ఆరోపణలు చేశారు. ఆయన చెప్పడం వల్లే వీళ్లు చేశారా? అనే అనుమానాన్ని మంచు విష్ణు వ్యక్తం చేయడం రచ్చ అవుతుంది.

`కన్నప్ప` హార్డ్ డ్రైవ్‌ మాయం వెనుక అనేక అనుమానాలు

ఇదిలా ఉంటే ఎప్పుడో రెండు నెలల క్రితం పంపిన ఈ హార్డ్ డ్రైవ్‌ ఇప్పుడు ఎలా మిస్‌ అయ్యింది? ఇక కోట్ల విలువ చేసే సినిమాకి సంబంధించిన హార్డ్ డ్రైవ్‌ని కొరియర్‌ ద్వారా పంపించడం ఏంటి? ఆ సమాచారం మంచు విష్ణుకి తెలియకపోవడమేంటి? 

అదే సమయంలో ప్రస్తుతం టీమ్‌ పని చేస్తున్న కంపెనీ అడ్రస్‌కి కాకుండా మరో ఆఫీస్‌ అడ్రెస్‌కి ఆ హార్డ్ డ్రైవ్‌లను పంపడమేంటనేది అనుమానంగా మారంది. మరి ఏం జరగబోతుందో మున్ముందు తేలనుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Divvala Madhuri అసలు రూపం బయటపెట్టిన రీతూ చౌదరీ తల్లి.. అన్‌ ఫెయిర్‌ ఎలిమినేషన్‌
Renu Desai ని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? బద్రి కంటే ముందే ఇంత కథ జరిగిందా?