బాలీవుడ్ రియాలిటీ షో ది ట్రైటర్స్ లో మంచు లక్ష్మీ, ఎమోషనల్ ట్రైలర్ చూశారా?

Published : May 30, 2025, 07:58 PM IST
Manchu Lakshmi joins The Traitors reality show on Prime Video

సారాంశం

బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే బిజీ అవుతోంది మంచు లక్ష్మీ. టాలీవుడ్ నుంచి ముంబయ్ చేరిన మంచువారి నటి.. అక్కడ చాలా ప్రయత్నాలు చేసింది. తాజాగా లక్ష్మీ ఓ పాపులర్ షోలో సందడి చేయబోతోంది.

టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన స్టార్ నటి మంచు లక్ష్మి బాలీవుడ్ లో అవకాశాల కోసం ముంబైలో సెటిల్ అయ్యింది. అక్కడే ఉంటూ బాలీవుడ్ లో ఛాన్స్ ల కోసం చురుకుగా ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. జిమ్, పార్టీలు, బాలీవుడ్ ప్రముఖులతో ఫోటోలు, సోషల్ మీడియాలో హడావిడి చేస్తోంది మంచు. ఇక తాజాగా మంచు లక్ష్మి ఓ పెద్ద బాలీవుడ్ రియాలిటీ షోలో పాల్గొనబోతున్నారు.

అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా జూన్ 12 నుండి స్ట్రీమింగ్ కాబోతున్న కొత్త రియాలిటీ షో ది ట్రైటర్స్ లో మంచు లక్ష్మి కంటెస్టెంట్‌గా పాల్గొంటున్నారు. ఈ షోకి ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. ప్రతి గురువారం రాత్రి 8 గంటలకు కొత్త ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాబోతోంది.

తాజాగా విడుదలైన ట్రైలర్‌ వైరల్ అవుతోది. ఈ షో ప్రత్యేకమైన థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో రూపొందుతోంది. బిగ్ బాస్ తరహాలో ఆటలతో పాటు మైండ్ గేమ్స్ కూడా ఉన్నట్టు ట్రైలర్ లో హింట్ ఇచ్చారు. ట్రైలర్‌లో మంచు లక్ష్మి భావోద్వేగంతో ఏడ్చిన దృశ్యం కనిపించింది.

మంచు లక్ష్మీతో పాటు ఉర్ఫీ జావేద్, ఆశిష్ విద్యార్ధి, రాజ్ కుంద్రా (శిల్పా శెట్టి భర్త) లాంటి పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా పాల్గొంటున్నారు. హాలీవుడ్‌లో విజయవంతమైన ఫార్మాట్ షో ఆధారంగా ఈ బాలీవుడ్ షో రూపొందించబడింది. బాలీవుడ్ ప్రేక్షకులకు అనుగుణంగా మార్పులు చేసి ఇండియాలోకి తీసుకున్నారు.

తెలుగు ప్రేక్షకులు టాలీవుడ్‌ నటి మంచు లక్ష్మి ఈ షోలో ఎలా మెప్పిస్తుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. షో స్టార్ట్ అయితే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌