Manchu Vishnu : చిరంజీవి, ప్రభాస్, అల్లు అర్జున్.. స్టార్స్ పై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు!

By Nuthi Srikanth  |  First Published Mar 23, 2024, 5:19 PM IST

‘మా’ అధ్యక్షుడు  మంచు విష్ణు (Manchu Vishnu) తాజాగా టాలీవుడ్ స్టార్స్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి, ఎన్టీఆర్, అల్లు అర్జున్ పై ఇలా మాట్లాడారు.


టాలీవుడ్ హీరో మంచు విష్ణు ‘మా’ ప్రెసిడెంట్ (Maa President)గా ఉన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తాజాగా విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో మలేషియాలో టాలీవుడ్ 90 సంవత్సరాల వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇందుకు సినీ ప్రముఖుల అభిప్రాయాలను తీసుకున్నామన్నారు. జులైలో ఈ వేడుకలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. 

తెలుగు సినిమాల ఘనకీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పేందుకు ఈ వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు.  దీనిపై త్వరలో మరిన్ని అప్డేట్స్ అందిస్తామన్నారు. ఈ క్రమంలోనే మంచు మనోజ్ టాలీవుడ్ స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu  Arjun), పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)పైన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఓవైపు చిరంజీవి, అల్లు అర్జున్ కు ప్రతిష్టాత్మకమైన అవార్డులు అందినా సినీ పెద్దలు సన్మానించడం లేదనే విమర్శలున్నాయి. 

Latest Videos

ఈ క్రమంలో మంచు విష్ణు వారి గురించి ఆసక్తికరంగా మాట్లాడారు. ‘మహనటుడు చిరంజీవి గారు తెలుగు నుంచి మొట్టమొదటిగా పద్మవిభూషణ్ ను అందుకున్నారు. మై బ్రదర్ అల్లు అర్జున్ కి బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం, కేరళలో అక్కడి స్టార్స్ కు సమానమైన క్రేజ్ దక్కడం, ఇక ప్రభాస్ ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటుడిగా ఉండటం గొప్పవిషయమన్నారు.’ అయితే వారికి ఈ వేడుకల్లో ప్రత్యేక గౌరవం దక్కేలా ఏమైనా ఏర్పాట్లు చేస్తారనే టాక్ నడుస్తోంది. దీనిపై ఎలాంటి అప్డేట్ లేదు. 

ఇక మంచు విష్ణు ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’ (Kannappa)లో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ న్యూజిలాండ్ లో శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కు మలయాళ నటుడు మోహన్ లాల్ (Mohanlal), తదితరులు హాజరయ్యారు. ప్రభాస్ పరమేశ్వరుడి పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో అవా ఎంటర్ టైన్ మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై పాన్ ఇండియా ఫిల్మ్  గా రూపుదిద్దుకుంటోంది. మహాభారత సిరీస్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రంలో నయనతార, అనుష్క కనిపించబోతున్నట్టు టాక్.  ఈ భారీ ప్రాజెక్ట్ కు మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం అందిస్తున్నారు.

click me!