ఫ్యామిలీతో సమ్మర్ వెకేషన్ కు మహేష్ బాబు.. రాజమౌళి సినిమా సంగతేంటి..?

By Mahesh JujjuriFirst Published Mar 23, 2024, 3:47 PM IST
Highlights

ఛాన్స్ దొరికితే చాలు.. ఫ్యామిలీతో విదేశాలకు చెక్కేస్తుంటాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.   అయితే షూటింగ్స్.. లేకుంటే ఫ్యామిలీతో ఫారెన్ ట్రిప్పులతో గడిపేస్తున్నాడు. తాజాగా మరోసారి ఫారెన్ ప్లైట్ ఎక్కాడు సూపర్ స్టార్.

అయితే సినిమాలు, షూటింగ్ లు.. లేకుంటే..ఫ్యామిలీ ఇల్లు ఈరెండే సూపర్ స్టార్ మహేష్ బాబు జీవితం. అందకే సినిమాల మధ్య గ్యాప్ దొరికితే చాలు.. భార్య నమ్రత.. పిల్లలు సితార, గౌతమ్ లను తీసుకుని ఫారెన్ ట్రిప్పులకు వెళ్తుంటాడు మహేష్. ఇండియాలో కంటే ఫారెన్ లోనే ఫ్రీడమ్ లైఫ్ దొరుకుతుంది సూపర్ స్టార్ కు. అక్కడ వీధుల్లో తిరుగుతూ.. స్ట్రీట్ ఫుడ్స్ కూడా లాగిస్తూ.. ఎంజాయ్ చేస్తుంటారు. ఇండియాలో అలా చేయలేరు కదా. తాజాగా సూపర్ స్టార్ సమ్మర్ వెకేషన్ కు ప్లాన్ చేసినట్టున్నారు. 

మహేష్ బాబు త్వరలో రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి మహేష్ బాబు కాంబోలో SSMB29 సినిమా రాబోతుంది. అసలు ఈ సినిమా మొదలు కూడా కాక ముందే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. దీంతో షూట్ ఎప్పుడు మొదలుపెడతారు అంటూ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

 

Superstar along with his family off to a vacation ♥️✈️ pic.twitter.com/ne369SU14H

— Sai Satish (@PROSaiSatish)

ఇదే టైమ్ లో సమ్మర్ వెకేషన్ కు వెళ్ళాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. తాజాగా మరోసారి మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లారు. ఈరోజు (23 మార్చ్ ) ఉదయం మహేష్ బాబు, సితార, గౌతమ్, నమ్రత కలిసి వెళ్తూ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనపడ్డారు. దీంతో ఈ విజువల్స్ వైరల్ గా మారాయి. సమ్మర్ ను మహేష్ ఎక్కడ ప్లాన్ చేశాడో అంటూ ఫ్యాన్స్ గుసగుసలాడుకుంటున్నారు. 

ఇక్కడ మరో విషయం ఏంటంటే.. రాజమౌళి సినిమా స్టార్ట్ అయ్యే టైమ్ లో.. మహేష్ వెకేషన్ కు వెళ్తున్నాడు.. అయితే ఇప్పట్లో జక్కన్న సినిమా ఓపెనింగ్ లేదా అని కొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొంత మంది మాత్రం.. రాజమౌళి సినిమా స్టార్ట్ అయితే.. మహేష్ బాబుకు ఇక వెకేషన్లకు వెళ్లే టైమ్ ఉండదు.. రెండు మూడేళ్లు లాక్ అయినట్టే.. అందుకే ఇప్పడు టైమ్ దొరికింది కాబట్టి వెకేషన్ ప్లాన్ చేశాడు అంటున్నారు. 

  

click me!