Oppenheimer OTT : ఓపెన్ హైమర్ తెలుగు వెర్షన్ వచ్చేసింది.. ఏ ఓటిటిలో అంటే

By tirumala ANFirst Published Mar 23, 2024, 5:00 PM IST
Highlights

96వ అకాడమీ అవార్డ్స్ లో ఓపెన్ హైమర్ చిత్రం ఏకంగా 7 ఆస్కార్ అవార్డుని కొల్లగొట్టింది. ఆస్కార్ అవార్డులు పక్కన పెడితే క్రిస్టఫర్ నోలెన్ తెరకెక్కించే చిత్రాలకు వరల్డ్ వైడ్ గా అభిమానులు ఉన్నారు.

96వ అకాడమీ అవార్డ్స్ లో ఓపెన్ హైమర్ చిత్రం ఏకంగా 7 ఆస్కార్ అవార్డుని కొల్లగొట్టింది. ఆస్కార్ అవార్డులు పక్కన పెడితే క్రిస్టఫర్ నోలెన్ తెరకెక్కించే చిత్రాలకు వరల్డ్ వైడ్ గా అభిమానులు ఉన్నారు. క్రిస్టఫర్ నోలెన్ లాంటి దర్శకుడు.. అణుబాంబు పితామహుడిగా పేరుగాంచిన ఓపెన్ హైమర్ జీవిత చరిత్రపై సినిమా తీస్తే ఎంత సంచలనం అవుతోందో అది చేసి చూపించారు. 

ఓపెన్ హైమర్ పాత్రలో సిల్లియన్ మర్ఫీ జీవించాడు అనే చెప్పాలి. గత ఏడాది థియేటర్స్ లోకి వచ్చిన ఈ చిత్రం అద్భుతం విజయం సాధించింది. అయితే థియేటర్స్ లో తెలుగు వెర్షన్ ని రిలీజ్ చేయలేదు. ఓటిటిలో అయినా తెలుగులో రిలీజ్ చేస్తారని ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు తెలుగు ప్రేక్షకుల నిరీక్షణ ఫలించింది. 

ఓటిటిలో ఓపెన్ హైమర్ చిత్రం ఇంగ్లీష్ తో పాటు హిందీ తెలుగు, కన్నడ, మలయాళీ, తమిళం ఇలా అన్ని భాషల్లోకి అందుబాటులో వచ్చింది. జియో సినిమా ఓటిటిలో ఓపెన్ హైమర్ తెలుగు వర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. సో తెలుగు ఆడియన్స్ మరోసారి ఓపెన్ హైమర్ చిత్రాన్ని చూసేయొచ్చు. 

ఈ చిత్రంలో ఓపెన్ హైమర్ కి భగవద్గీత అనే మక్కువ ఉండే వ్యక్తిగా చూపించిన సంగతి తెలిసిందే. ఓపెన్ హైమర్ కి సంస్కృతంలో కూడా మంచి ప్రావీణ్యం ఉంది. అయితే ఒక శృంగార సన్నివేశంలో భగవద్గీతని పెట్టడంతో తీవ్ర వివాదం చెలరేగింది. ఇక అకాడమీ అవార్డ్స్ లో ఈ చిత్రం ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సహాయనటుడు సహా మొత్తం 7 ఆస్కార్ అవార్డులు అందుకుంది. 

click me!