మంచు విష్ణుకి కన్నీరు తెప్పించిన కూతుళ్లు.. భలే సర్ప్రైజ్, ఏం చేశారంటే..

Published : Mar 02, 2023, 04:09 PM IST
మంచు విష్ణుకి కన్నీరు తెప్పించిన కూతుళ్లు.. భలే సర్ప్రైజ్, ఏం చేశారంటే..

సారాంశం

మంచు విష్ణు ప్రస్తుతం మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే హీరోగా కూడా రాణిస్తున్నాడు. అయితే విష్ణుకి ఇటీవల సినిమాల్లో మంచి ఫలితాలు రాలేదు.

మంచు విష్ణు ప్రస్తుతం మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే హీరోగా కూడా రాణిస్తున్నాడు. అయితే విష్ణుకి ఇటీవల సినిమాల్లో మంచి ఫలితాలు రాలేదు. విష్ణు చివరగా నటించిన జిన్నా చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అయితే విష్ణు ఫ్యామిలీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ భార్య పిల్లలతో సంతోషంగా గడపడం చూస్తూనే ఉన్నాం. 

మంచు విష్ణు , విరానికా దంపతులు 15వ వెడ్డింగ్ యానవర్సరీ జరుపుకున్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు ముద్దుల కుమార్తెలు అరియనా, వివియానా అద్భుతమైన మ్యారేజ్ యానవర్సరీ గిఫ్ట్ ఇచ్చారు. తమ తల్లిదండ్రుల పెళ్లి జీవితం ఎలా మొదలైందో బ్యూటిఫుల్ మెమొరీస్ తో తెలియజేస్తూ అద్భుతమైన సాంగ్ ద్వారా వీడియో రూపొందించారు. 

అరియనా, వివియానా గాత్రం ఎమోషనల్ గా, అద్భుతంగా ఉంది. మంచు విష్ణు ఈ వీడియో షేర్ చేస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేసారు. ఈ సాంగ్ చివరకి వచ్చే సరికి కన్నీళ్లు పెట్టుకున్నా. నా డార్లింగ్స్ అరియనా, వివియానా ఇద్దరికీ థ్యాంక్స్. నేను విరానికా ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ ఎప్పటికి మర్చిపోలేం అని పేర్కొన్నాడు. 

మంచు విష్ణు, విరానికా దంపతులు 2008లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ దంపతులకు నలుగురు పిల్లలు సంతానం. మొదట అరియనా, వివియానా కావలపిల్లలుగా జన్మించారు. ఆ తర్వాత ఒక బాబు, కుమార్తె జన్మించారు. మోహన్ బాబు వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విష్ణు.. ఆరంభంలో మంచి విజయాలు దక్కించుకున్నాడు. ఢీ లాంటి బిగ్ హిట్ తో క్రేజీ హీరోగా గుర్తింపు పొందాడు. కానీ ఆ తర్వాత విష్ణు నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాలేదు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ, సంజనాల డ్రామాలు కళ్లకి కట్టినట్టు చూపించిన బిగ్‌ బాస్‌.. కళ్యాణ్‌ ఫస్ట్‌ ఫైనలిస్ట్
Anasuya: నేనేమీ సాధువును కాదు.. ఇలా మాట్లాడటం నాకూ వచ్చు