నాగబాబు (Nagababu) చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరి కొద్దిసేపట్లోనే తాను వీడియో ద్వారా అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానన్నారు మా అధ్యక్ష బరిలో నిలిచిన మంచు విష్ణు (manchu vishnu).
నాగబాబు (Nagababu) చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరి కొద్దిసేపట్లోనే తాను వీడియో ద్వారా అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానన్నారు మా అధ్యక్ష బరిలో నిలిచిన మంచు విష్ణు (manchu vishnu). శనివారం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ భవనంలో ఎన్నికల సరళిని ఆయన పరిశీలించారు. అలాగే మా ఎన్నికల అధికారి నిర్వహించిన సమీక్షా సమావేశానికి మంచు విష్ణు హాజరయ్యారు. తమకు మద్ధతుగా 550 మంది సభ్యులు వచ్చారని ఆయన తెలిపారు. వారంతా తనతోనే వున్నారని విష్ణు వెల్లడించారు. వాళ్లని పిలిచి తనకు ఓటు ఎందుకు వేయాలని చెప్పానని తెలిపారు.
వాళ్లకు నచ్చితే ఎవరికైనా ఓటు వేస్తారని... నా అభిప్రాయాలు వాళ్లకు నచ్చాయని విష్ణు ఆకాంక్షించారు. చరిత్రలో జరగనట్లు ఇతర నగరాల్లో వున్న మా సభ్యులు కూడా హైదరాబాద్‌కు వచ్చారని తెలిపారు. నేరుగా ఎయిర్‌పోర్ట్ నుంచి ఇక్కడికి వచ్చి తర్వాతి ఫ్లైట్‌లో తిరిగి స్వస్థలాలకు వెళ్లిపోతారని విష్ణు పేర్కొన్నారు. ఈన్ని రోజుల నుంచి తాను చేసింది తప్పు అని ఎన్నికల అధికారి అనుకుంటే తనను సస్పెండ్ చేయొచ్చని విష్ణు స్పష్టం చేశారు. చట్టపరంగా తాను మా సభ్యులను పిలిచి వారిని ఓటు అడిగే హక్కుందని ఆయన అన్నారు. తన పూర్తి ప్యానెల్ గెలిస్తేనే నేను ఏం చేయదలచుకున్నానో చేయగలనని విష్ణు చెప్పారు.
undefined
మా ఎన్నికలపై (maa elections) నాగబాబు శుక్రవారం రాత్రి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రధానితో పోరాటం తెలిసిన వ్యక్తి ప్రకాశ్‌రాజ్ అని అన్నారు. ప్రకాశ్ రాజ్ కు (prakash raj) ఉన్న ప్రత్యేకతలు విష్ణులోలేవని.. ప్రకాశ్ రాజ్‌తో పోల్చాలంటే మోహన్ బాబును పోల్చాలని నాగబాబు అన్నారు. విద్యార్థులకు ఏం కావాలో విద్యాసంస్థ నడుపుతున్న మోహన్ బాబు (mohan babu) కు తెలుసునని.. నటీనటులకు ఏం కావాలో ఆఫీసుల చుట్టూ తిరిగిన ప్రకాశ్ రాజ్‌కే తెలుసునని మెగా బ్రదర్ కామెంట్ చేశారు. నిర్మాతలతో వివాదం ప్రకాశ్ రాజ్‌కే కాదు మోహన్ బాబు కుటుంబానికి ఉన్నాయని నాగబాబు గుర్తుచేశారు.
సలీం చిత్రం విషయంలో డైరెక్టర్ వైవీఎస్ చౌదరినే (yvs chowdary) మోహన్ బాబు అదోగతి పట్టించారని.. మోహన్ బాబుకు ఎదురు తిరగలేక ఎంతో మంది వెనుతిరిగారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ వివాదాల్లో తప్పెవరిదో తమకు తెలియదని.. ప్రకాశ్ రాజ్ వివాదాల్లో తప్పెవరిదో మీకు తెలియదని నాగబాబు అన్నారు. విష్ణు నువ్వు ఎక్కడ పుట్టావ్, ఎక్కడ చదువుకున్నావ్.. మీ అమ్మానాన్నలు మాత్రమే తెలుగువాళ్లు అని ఆయన దుయ్యబట్టారు. ప్రకాశ్ రాజ్, విష్ణు తెలుగు పరీక్ష రాస్తే విష్ణుకు పాస్ మార్కులు కూడా రావంటూ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశ్ రాజ్‌ని తెలుగోడంటారు.. విష్ణును తెలుగు నేర్చుకొమ్మంటారని, సినిమా జ్ఞానం, ప్రపంచ జ్ఞానం ఉన్న ప్రకాశ్ రాజ్‌కే నా మద్దతు అని నాగబాబు మరోసారి తేల్చిచెప్పారు.