`మా`(మూవీ ఆర్టిస్టు అసోసియేషన్)కి ఇటీవల జరిగిన ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ గెలుపొందిన విషయం తెలిసిందే. శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సోమవారం మంచు విష్ణు తన కొత్త కమిటీతో తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో ముచ్చటించారు.
పవన్ కళ్యాణ్ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్, ఆయనతో విభేదాలు లేవు, ఆదివారం జరిగిన కార్యక్రమంలో మేం కింద చర్చించుకున్నామంటున్నారు `మా` కొత్త అధ్యక్షుడు మంచు విష్ణు. తాజాగా ఆయన తిరుపతిలో మీడియాతో ముచ్చటించారు. `మా`(మూవీ ఆర్టిస్టు అసోసియేషన్)కి ఇటీవల జరిగిన ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ గెలుపొందిన విషయం తెలిసిందే. శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం సోమవారం మంచు విష్ణు తన కొత్త కమిటీతో తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో ముచ్చటించారు.
ఇందులో Manchu Vishnu అనేక విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఆదివారం జరిగిన `అలాయ్ బలాయ్` కార్యక్రమంలో Pawan Kalyanని, మంచు విష్ణుకి మధ్య ఏర్పడిన గ్యాప్‌పై విష్ణు క్లారిటీ ఇచ్చారు. స్టేజ్‌పైన ఏం జరిగిందో చూశారు. కానీ అంతకు ముందే స్టేజ్ కింద తామిద్దరం మాట్లాడుకున్నామని, చాలా విషయాలు డిస్కస్ చేసుకున్నామని తెలిపారు విష్ణు. తనపై జోకులు కూడా వేశారని పేర్కొన్నారు. చాలా రోజులుగా పవన్ కళ్యాణ్ తమ ఫ్యామిలీ ఫ్రెండ్ అని వెల్లడించారు.
undefined
ఇక చిరంజీవి.. మోహన్‌బాబుకి ఫోన్ చేసిన మాట్లాడారనే విషయంపై స్పందిస్తూ, వారిద్దరి మధ్య డిస్కషన్ జరిగిందని, ఏం మాట్లాడుకున్నారనేది వాళ్లనే అడగాలని తెలిపారు విష్ణు. Maa Election ఓటింగ్ లెక్కింపులో జరిగిన అవకతవకాలపై ఆయనస్పందిస్తూ, ఓట్ల లెక్కింపులో ఎలాంటి తేడా జరగలేదన్నారు. మొదటి రోజులు ముఖ్యమైన పోస్ట్ ల రిజల్ట్ ని ఇచ్చామన్నారు. రాత్రి ఆలస్యమైన కారణంగా ఈసీ మెంబర్స్ కి సంబంధించిన లెక్కింపు వాయిదా వేశామన్నారు. అయితే ముందు లెక్కింపులో పోస్టల్ బ్యాలెట్‌లో ప్రకాష్‌రాజ్‌కి కేవలం 7 ఓట్లు పడ్డాయని, మిగిలని తనకు పడ్డాయన్నారు.
ఈసీ మెంబర్స్ కి సంబంధించి పదిమంది Prakash Raj ప్యానెల్ సభ్యులు ముందుంజలో ఉన్నారని, తమ వైపు నుంచి ఎనిమిది మంది ముందుంజలో ఉన్నారని తెలిపారు. నెక్ట్స్ డే పూర్తి స్థాయిలో జరిగిన ఓట్ల లెక్కింపులో తమకి పది మేజారిటీ లభించిందని, వాళ్లు ఎనిమిది విజయం సాధించారని తెలిపారు. కానీ ఎక్కడా ఓట్ల లెక్కింపు తేడా జరగలేదన్నారు. ఈ సారి తాము గెలిచామని, వారికి నెక్ట్స్ టైమ్‌కి బెటర్ లక్ అని చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్ కావాలంటే ప్రకాష్‌రాజ్ హ్యాపీగా చూసుకోవచ్చని తెలిపారు.
also read: అలయ్ బలయ్ వేదికపై ఎడమొహం పెడమొహంగా మంచు విష్ణు పవన్... వైరల్ గా మంచు విష్ణు ట్వీట్!
బైలాస్‌లో తాము మార్పులు చేయాలనుకుంటున్నట్టు చెప్పారు మంచు విష్ణు. మెంబర్‌షిప్ విషయంలో కొన్ని మార్పులు చేయాలనుకుంటున్నట్టు తెలిపారు. అలాగే ఇతర ఆర్టిస్టు అసోషియన్ల బైలాస్ చదివి, మన తెలుగు వారికి ఏది ఉపయోగకరంగా ఉంటుందో అలా మార్పులు చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. అయితే ఏదైనా పెద్దల సలహాలు, సూచనలు, వారి అంగీకారంతోనే జరుగుతుందని, ప్రస్తుతానికి ఎలాంటి మార్పులు చేయలేదన్నారు. ఎప్పుడైనా ఎవరనైనా `మా`లో పోటీ చేసే అవకాశం ఉంటుందని, ఇది ప్రజాస్వామ్య హక్కు అని తెలిపారు విష్ణు.
ప్రకాష్‌రాజ్, నాగబాబు రాజీనామాలు చేశారని, కానీ వాటిని మేం అంగీకరించబోమన్నారు. అలాగే `మా`లో గెలిచిన ప్రకాష్‌రాజ్ ప్యానెల్ సభ్యుల రాజీనామాలు తనకు అందలేదని, వాళ్లు రాజీనామా చేస్తున్నట్టు మీడియాలోనే చూశానని తెలిపారు. అయితే ఒకే ఒక రాజీనామా తనకు అందిందని తెలిపారు. ఆన్‌లైన్ టికెటింగ్‌పై స్పందిస్తూ ఆన్‌లైన్ టికెటింగ్‌ని తాను ఆమోదిస్తున్నట్టు చెప్పారు.
also read:పవన్, విష్ణు ఎడమొహం పెడమొహంపై మంచు లక్ష్మి కామెంట్
బాబు మోహన్ స్పందిస్తూ, ఓటమిని జీర్ణించుకోలేక కామెంట్లు చేస్తున్నారని, విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ఇది అందరి గెలుపన్నారు. ఇందులో మంచు విష్ణు ప్యానెల్ సభ్యులంతా పాల్గొన్నారు.