హైదరాబాద్ లో బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో జరిగిన అలాయ్ బలాయ్ కార్యక్రమానికి హాజరయ్యారు. జనసేన పార్టీ అధ్యక్షుడి హోదాలో పవన్, మా అధ్యక్షుడి హోదాలో మంచు విష్ణు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదికపై వీరిద్దరు పక్క పక్కనే కూర్చున్నారు.
'మా' అసోసియేషన్ (MAA) నేపధ్యంలో టాలీవుడ్ లో రోజుకో రచ్చ జరుగుతోంది. మీడియాకు మేత దొరుకుతోంది. తాజాగా మరో ఆసక్తికరమైన సన్నివేశం తెరపైకి వచ్చింది. ఈసారి మంచు విష్ణు (Manchu Vishnu), పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇష్యూ తెరపైకి వచ్చింది. వీరిద్దరు హైదరాబాద్ లో బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో జరిగిన అలాయ్ బలాయ్ కార్యక్రమానికి హాజరయ్యారు. జనసేన పార్టీ అధ్యక్షుడి హోదాలో పవన్, మా అధ్యక్షుడి హోదాలో మంచు విష్ణు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదికపై వీరిద్దరు పక్క పక్కనే కూర్చున్నారు. పవన్ కల్యాణ్‌తో మాట్లాడేందుకు మంచు విష్ణు యత్నించారు. కానీ పవన్ అక్కడ నుంచి పక్కకు వెళ్లిపోయారు. మంచు విష్ణును అస్సలు పట్టించుకోలేదు అనేది మీడియాలో పెద్దగా హైలెట్ అయ్యింది.
అలాగే ఆ తర్వాత స్టేజిపై విష్ణు, పవన్ ఒకరికొకరు ఎదురుపడ్డారు. కానీ పలకరించుకోలేదు. వేదికపై పవన్ కల్యాణ్ ఓ మెమొంటో తీసుకున్నారు. ఆ తర్వాత విష్ణు మెమెంటో కోసం వెళ్లాలి. ఇలా ఇద్దరూ మరోసారి ఎదురుపడ్డారు. అప్పుడు కూడా సేమ్.. సీన్. విష్ణు పక్కకు జరిగితే.. పవన్ సైలెంట్‌గా వెళ్లిపోయారు. మాటల్లేవ్.. మాటాడుకోవడాల్లేవ్ అని మీడియా హైలెట్ చేసింది. వేదికపై చాలా సేపు ఇద్దరు పక్కపక్కనే కూర్చుతున్నారు. కానీ అస్సలు మాట్లాడుకోలేవటమై కొన్ని ఛానెల్స్ డిస్కషన్స్ పెట్టేసారు. అసలు ఇంతకు ముందు వీరికి పరిచయమే లేదన్నట్లుగా ప్రవర్తించటం ఆశ్చర్యమన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో... వీరి వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపధ్యంలో మంచు లక్ష్మి మాట్లాడింది.
undefined
‘మా’ అధ్యక్షడిగా పదవీ స్వీకారం చేసిన తర్వాత మంచు విష్ణు తన అక్క మంచు లక్ష్మితో పాటు తన ప్యానల్ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.అప్పుడు మీడియాతో ఈ విషయం పై మంచు లక్ష్మి, ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
మంచు లక్ష్మి మాట్లాడుతూ.. ‘బండారు దత్తాత్రేయ గారి అలయ్ బలయ్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ తో పాటు విష్ణు కూడా వెళ్ళాడు. అయితే, బయట ప్రచారం జరుగుతున్నట్లు.. పవన్ కళ్యాణ్, విష్ణు ఎడమొహం పెడమొహంగా లేరు. కెమెరా కి వెనుక ఇద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారు. ఈ విషయం తెలియక ఒక ఫోటో తీసుకుని సోషల్ మీడియాలో కొంతమంది నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు’ అంటూ మంచు లక్ష్మి మండి పడ్డారు.. మాలో మాకు విబేధాలు లేవు.. మేమంతా ఒకటే అంటూ మంచి లక్ష్మి చెప్పారు.
also read: మంచు లక్ష్మీ దారుణంగా ట్రోలింగ్.. నెటిజన్లకి నటి దిమ్మతిరిగే కౌంటర్.. నెట్టింట వైరల్
అలాగే విష్ణు మా అధ్యక్షుడిగా గెలవాలని ఆంధ్ర, తెలంగాణ ప్రజలు సపోర్ట్ చేశారని చెప్పారు. విష్ణు గెలవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు. ఇక ఇప్పుడు శ్రీవెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కోసం మేము అందరం వచ్చామన్నారు మంచు లక్ష్మి. ఇక మంచు విష్ణు మాట్లాడుతూ.. ప్రస్తుతం ‘మా’ బాగుందని.. దీనిని నెక్స్ట్ జనరేషన్ లెవెల్ కి తీసుకుని వెళ్తానని చెప్పారు. అంతేకాదు మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ కు నూతన భవన నిర్మాణంపై మూడు నెలల్లో స్పష్టత ఇస్తానన్నారు.