'మా' సీసీటీవీ ఫుటేజ్ వివాదం.. రెండు ప్యానల్స్ వాళ్ళు వస్తేనే చూపిస్తాం, సర్వర్ రూమ్ కి పోలీసులు

By telugu teamFirst Published Oct 18, 2021, 12:11 PM IST
Highlights

'మా' ఎన్నికలు ముగిసినప్పటికీ వేడి మాత్రం చల్లారడం లేదు. ప్రకాష్ రాజ్, విష్ణు ప్యానల్ మధ్య ఏదో ఒక వివాదం రగులుతూనే ఉంది. మంచు విష్ణు ఇటీవల మా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం కూడా చేశారు. 

'మా' ఎన్నికలు ముగిసినప్పటికీ వేడి మాత్రం చల్లారడం లేదు. ప్రకాష్ రాజ్, విష్ణు ప్యానల్ మధ్య ఏదో ఒక వివాదం రగులుతూనే ఉంది. Manchu Vishnu ఇటీవల మా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం కూడా చేశారు. దీనితో 'మా'కి కొత్త కార్యవర్గం ఏర్పడింది. ఇదిలా ఉండగా భారీ అంచనాలతో మా ఎన్నికల్లోకి దిగిన ప్రకాష్ రాజ్ ఓటమి చెందారు. 

దీనితో మనస్తాపానికి గురైన Prakash Raj, అతడి ప్యానల్ సభ్యులు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. దీనితో వివాదం మరింత ముదిరింది. అక్టోబర్ 10న జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో జరిగిన MAA election సజావుగా సాగలేదు. ఇరు పక్షాల మధ్య గొడవలతో పెద్ద రసాభాస సరిగింది. ఎన్నికల అనంతరం Mohan Babu తమని బూతులతో దుర్భాషలాడారు అంటూ ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 

ఎన్నిక జరిగిన విధానం పట్ల అనుమానాలు ఉన్నాయని, సీసీటీసీ ఫుటేజ్ ఇవ్వాలని ప్రకాష్ రాజ్ ఎన్నికల అధికారికి లేఖ రాయడం మరో సంచలనంగా మారింది. సీసీటీవీ ఫుటేజ్ కోసం ప్రకాష్ రాజ్ పోలీసులని సైతం ఆశ్రయించారు. 

దీనితో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ కోసం రంగంలోకి దిగారు. కొద్దిసేపటి క్రితమే పోలీసులు ఎన్నిక జరిగిన జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ లో సర్వర్ రూమ్ కి వెళ్లారు. ప్రకాష్ రాజ్ కూడా స్కూల్ కి వెళ్లారు. ప్రకాష్ రాజ్ పోలీసులని సీసీటీవీ ఫుటేజ్ అడగగా.. ఇరు పక్షాల వాళ్ళు వస్తేనే ఫుటేజ్ చూసేందుకు వీలవుతుందని తెలిపారు. తమపై దాడి చేసిన దృశ్యాలు ఫుటేజ్ లో ఉన్నాయని ప్రకాష్ రాజ్ ఆరోపిస్తున్నారు. అయితే ప్రస్తుతం పోలీసులు సర్వర్ రూమ్ ని పరిశీలిస్తున్నారు. 

Also Read: శ్రీవారి సేవలో మంచు విష్ణు.. ప్రకాష్ రాజ్ ప్యానల్ రాజీనామాలు అందలేదంటూ కామెంట్స్

ఇక 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. సీసీటీవీ ఫుటేజ్ వివాదం గురించి మాట్లాడుతూ అవసరమైతే ప్రకాష్ రాజ్ ఫుటేజ్ చూసుకోవచ్చు అని అన్నారు. 

విష్ణు నేడు తన ప్యానల్ సభ్యులతో తిరుమలలో శ్రీవారిని సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ తనకి ఇంకా ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యుల రాజీనామాలు అందలేదని కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.  

click me!