చరణ్‌ నాకు ఓటు వేయలేదు, ఎన్టీఆర్ ఎందుకు ఓటేసేందుకు రాలేదో తెలుసు

By Surya PrakashFirst Published Oct 12, 2021, 11:10 AM IST
Highlights

రామ్‌ చరణ్‌ నాకు మంచి మిత్రుడు. కానీ, తన ఓటు ప్రకాశ్‌రాజ్‌గారికే వేశాడని చెప్పగలను. ఎందుకంటే చరణ్‌ తన తండ్రి మాటని కాదనడు. 

గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు సినీ వర్గాల్లో చర్చకు దారితీసిన మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు ముగిసాయి. హోరాహోరీగా సాగిన పోరులో మంచు విష్ణు విజయం సాధించిన సంగతి తెలిసిందే. సమీప ప్రత్యర్థి ప్రకాశ్‌రాజ్‌పై అపూర్వ విజయం సొంతం చేసుకున్నారు. ప్రకాశ్‌రాజ్‌పై మంచు విష్ణు 107 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ నేపధ్యంలో ఫలానా స్టార్స్ ఓటేసారు..ఎవరు వేయలేదు అంటూ మీడియాలో చర్చ మొదలైంది. దానికి మీడియా ఎదురుగా మంచు విష్ణు సమాధానం చెప్పారు.

మంచి విష్ణు మాట్లాడుతూ...‘‘రామ్‌ చరణ్‌ నాకు మంచి మిత్రుడు. కానీ, తన ఓటు ప్రకాశ్‌రాజ్‌గారికే వేశాడని చెప్పగలను. ఎందుకంటే చరణ్‌ తన తండ్రి మాటని కాదనడు. మా నాన్నని నేను ఎలా ఫాలో అవుతానో చిరంజీవిని చరణ్‌ అలానే ఫాలో అవుతాడు. ‘ప్రకాశ్‌రాజ్‌ పోటీ చేస్తున్నాడు కదా. ఏకగ్రీవం చేద్దాం. విష్ణు ఎందుకు? విత్‌ డ్రా చేసుకోమని’ చిరంజీవి అంకుల్‌ నాన్నతో చెప్పారు. కానీ, ఎన్నికలు జరగాలనే ఉద్దేశంతో పోటీ చేశా. ఎన్నికల ఫలితాల విషయంలో నాకు వచ్చిన తొలి ఫోన్‌కాల్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ది. ఓటేసేందుకు తనెందు రాలేదో నాకు తెలుసు.’’ అన్నారు.

Also read `మా ఎన్నికలు` మోహన్‌బాబు తీవ్ర వ్యాఖ్యలు.. చిరంజీవిని ఉద్దేశించేనా?.. టాలీవుడ్‌లో దుమారం..

ఇక ఓటమి అనంతరం ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌(Prakash Raj) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది బాధతో చేస్తున్న రాజీనామా కాదని, ‘అతిథిగా వచ్చాను.. అతిథిగా ఉండాలి’ అనే ఉద్దేశంతో చేస్తున్నానని అన్నారు. ఈ మేరకు ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలిచిన మంచు విష్ణు(Manchu Vishnu)కు సందేశం పంపారు. దీనిపై మంచు విష్ణు రిప్లై ఇచ్చి, ఆ స్క్రీన్‌షాట్‌ను అభిమానులతో పంచుకున్నారు.

ప్రకాశ్‌రాజ్‌ రాస్తూ.. డియర్‌ విష్ణు, ‘మా’ ఎన్నికల్లో నీవు సాధించిన అద్భుత విజయానికి అభినందనలు. ‘మా’ను నడిపించేందుకు అవసరమైన శక్తినంత పొందాలని కోరుకుంటున్నా. ఆల్‌ ది బెస్ట్‌. ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా. దయచేసి నా నిర్ణయాన్ని ఆమోదించండి. నాన్‌-మెంబర్‌గా నీకు అన్ని విధాలా సాయం చేస్తా.. థ్యాంక్యూ ప్రకాశ్‌రాజ్‌’’ అని మెస్సేజ్‌ పంపగా, అందుకు విష్ణు సమాధానం ఇచ్చారు.

Also read మెగా బ్రదర్ నాగబాబు ‘మా’ రాజీనామా లేఖలో ఏం రాశారంటే..?

మంచు విష్ణు రిప్లై ఇస్తూ.. మీరు తీసుకున్న నిర్ణయం పట్ల నేను సంతోషంగా లేను. మీరు నాకంటే పెద్ద వారు. జీవితంలో గెలుపోటములనేవి ఒకే నాణేనికి రెండు వైపులా ఉంటాయి. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. మీరు భావోద్వేగానికి లోనుకావొద్దు. మా కుటుంబలో మీరూ భాగమే. కలిసి పనిచేయడానికి మీ ఆలోచనలకు మాకు అవసరం. మీరు ఇప్పుడు నాకు సమాధానం ఇవ్వొద్దు. త్వరలోనే మిమ్మల్ని కలుస్తా. అన్ని విషయాలపై చర్చించుకుందాం. లవ్‌ యు అంకుల్‌. దయచేసి తొందరపడొద్దు’’ అని పేర్కొన్నారు.
 

click me!