ఆ సినిమాలో నటించడం కన్నా, జీవితంలో ఆలా ప్రవర్తించగలగడమే సంతృప్తి

By Surya PrakashFirst Published Oct 12, 2021, 10:17 AM IST
Highlights

రాజకీయ నేపథ్యంతో సాగే కథతో పవన్ ఈ చిత్రం చేస్తున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే, అనుకోకుండా ఆ చిత్రం మొదట్లోనే ఆగిపోయింది. ఇప్పుడీ చిత్రాన్ని పవన్ కల్యాణ్ తనే గుర్తుచేసుకున్నారు.

కొన్ని సార్లు స్టార్స్ సినిమాలు మొదలవుతాయి. రకరకాల కారణాలతో అవి ఆగిపోతాయి. అయితే వాటిని అందరూ లైట్ తీసుకుంటారు. వాటిని మర్చిపోతారు. కాని కొన్ని మాత్రం జీవితాంతం గుర్తుస్తూనే ఉంటాయి. అలాగే, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్లో కూడా అలాంటి సినిమా ఒకటుంది. అదే 'సత్యాగ్రహి'. రాజకీయ నేపథ్యంతో సాగే కథతో పవన్ ఈ చిత్రం చేస్తున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే, అనుకోకుండా ఆ చిత్రం మొదట్లోనే ఆగిపోయింది. ఇప్పుడీ చిత్రాన్ని పవన్ కల్యాణ్ తనే గుర్తుచేసుకున్నారు.

'లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆధ్వర్యంలో జరిగిన నాటి ఎమర్జన్సీ కాలం నాటి ఉద్యమాన్ని ప్రేరణగా తీసుకుని చేయాలనుకున్న చిత్రం అది. 2003లో అనుకుంటా, దాని ప్రారంభం కూడా జరిగింది. అంతలోనే అది ఆగిపోయింది. అయితే, ఆ సినిమాలో నటించడం కన్నా, ఇప్పుడు నిజ జీవితంలో ఆలా ప్రవర్తించగలగడమే నాకు సంతృప్తిని ఇస్తోంది' అంటూ పవన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఇప్పుడిది వైరల్ అవుతోంది.  

Also readMAA elections: చిత్ర పరిశ్రమ ఎప్పుడూ చీలిపోదు, చిరు, మోహన్ బాబు మిత్రులు - పవన్ కళ్యాణ్

దాదాపు18 ఏళ్ల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ''సత్యాగ్రహి'' అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటన వచ్చింది. ఇదొక పొలిటికల్ డ్రామా అని అప్పట్లో ప్రచారం జరిగింది. ప్రముఖ నిర్మాత ఎంఎమ్ రత్నం ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తారని చెప్పుకున్నారు ప్రొడ్యూస్ చేస్తా అన్నారు. అప్పట్లో పవన్ రోడ్డు మీద నడుస్తున్నట్టుగా ఉన్న ఓ పోస్టర్ కూడా అప్పట్లో వైరల్ అయింది. కానీ ఆ చిత్రం ప్రారంభంలోనే ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ అభిమానులు అప్పుడప్పుడు ఈ చిత్రాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు కూడా. అయితే 2003 లో పక్కన పెట్టిన ఈ ప్రాజెక్ట్ ని ఇన్నేళ్ల తర్వాత పవన్ గుర్తు చేసుకున్నారు. ఇప్పుటి పరిస్థితులకు అన్వయించుకొని తాజాగా ఓ ట్వీట్ చేయటం వైరల్ అవుతోంది.

 పవన్ కళ్యాణ్.. 'వకీల్ సాబ్' సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి ఇచ్చారు. ఈ క్రమంలో మరో అర డజను చిత్రాలకు పవన్ కమిట్ అయ్యారు. ప్రస్తుతం నటిస్తున్న 'భీమ్లా నాయక్' చిత్రం 2022 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అలానే 'హరిహర వీరమల్లు' వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. త్వరలోనే 'భవదీయుడు భగత్ సింగ్' మూవీని కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత  సురేందర్ రెడ్డి సినిమాని స్టార్ట్ చేస్తారు. 
 

click me!