చిరంజీవికి పద్మ విభూషన్ పై.. మంచు ఫ్యామిలీ రియాక్షన్, మోహన్ బాబు, విష్ణు ఏమన్నారంటే..?

మెగాస్టార్ కు పద్మ విభూషన్ వచ్చిందనగానే చాలామంది మంచు ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి..? వారికామెంట్స్ ఏంటీ అనేదానిపై ఎక్కువ ఆసక్తి చూపించారు. ఇక ఈ విషయంలో మోహన్ బాబు, ఏమని స్పందించారంటే..? 


టాలీవుడ్ లో బాగా ట్రోల్స్ కు గురయ్యే.. పెద్ద ఫ్యామిలీ అనగానే మంచు ఫ్యామిలీనే గుర్తుకు వస్తుంది. ఏదో చెప్పాలని.. మరేదో చెప్పి అనవసరంగా నెటిజన్లకు బలైపోతుంటారు మంచు ఫ్యామిలీ. ఇక టాలీవుడ్ లో ఏదైనా ఇష్యూ జరిగితే.. ఎవరు స్పందించినా.. స్పందించకపోయినా.. అందరు ముందుగా మంచుఫ్యామిలీ స్పందన కోసమే ఎదరు చూస్తుంటారు. వారు ఏదైనా డిఫరెంట్  గా మాట్లాడితే.. ట్రోల్ చేయడానికి రెడీగా ఉంటారు సోషల్ మీడియా జనాలు. 

ఈక్రమంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి పద్మ విభూషణుడు అయ్యాడు. దేశంలోనే రెండోవ అత్యున్నతమైన అవార్డ్ ఆయన్ను వరించింది. దాంతో టాలీవుడ్ అంతా మెగాస్టార్ ఇంటిముందు క్యూ కట్టారు. సోషల్‌ మీడియాలోనూ మెగాస్టార్‌ పేరు మార్మోగిపోతోంది. ఫ్యాన్స్, నెటిజన్లు చిరంజీవిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబు చిరంజీవి పద్మవిభూషన్‌ అవార్డు రావడంపై స్పందించారు. నా ప్రియమైన స్నేహితుడికి శుభాకాంక్షలు. ఈ పురస్కారానికి నువ్వు అన్ని విధాలా అర్హుడివి. పద్మ విభూషన్‌ అవార్డు పొందిన నిన్ను చూసి ఎంతో గర్వ పడుతున్నాను’ అని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు మోహన్‌ బాబు.

Latest Videos

 

Congratulations to my dear friend on this well-deserved honor! We are all very proud of you for receiving the award.

— Mohan Babu M (@themohanbabu)

మంచు విష్ణు కూడా చిరంజీవికి ట్విట్టర్‌ వేదికగా అభినందనలు తెలిపాడు. ‘నిద్ర లేవగానే శుభవార్త విన్నాను. చాలా సంతోషం అనిపించింది. చిరంజీవి గారికి ఎంతో విలువైన పద్మ విభూషణ్‌ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. మన తెలుగు చిత్ర సీమకు ఈ అవార్డు గర్వ కారణం’ అని మంచు విష్ణు ట్వీట్‌ చేశారు. ఇక వీరి స్పందన చూసి నెటిజన్ల హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఏదైనా డిఫరెంట్ గా స్పందిస్తారేమో అని ట్రోలర్స్ కూడా వెయిట్ చేశారు.. కాని ఇంత పాజిటీవ్ గా స్పందించడం హ్యాపీగా ఉందంటూ..ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. 

 

Woke up to the fantastic news on Sri. garu winning the prestigious ! What a proud moment for Telugu Film Industry! Congratulations Garu 💪🏽👌❤️

— Vishnu Manchu (@iVishnuManchu)

ఇక మెగాస్టార్ చిరంజీవికి వీరితో పాటు.. టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా విషెష్ తెలుపుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, పవన్‌ కల్యాణ్‌, అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌, రవితేజ లాంటి స్టార్స్ కూడా చిరంజీవికి అభినందనలు తెలిపారు. ఇక తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి చిరంజివి ఇంటికెళ్లి ఆయనను అభినందించారు. మెగాస్టార్ కు భారతరత్న రావాలి అని కోరకున్నారు. అటు నిర్మాత దిల్‌ రాజుతో పాటు చాలామంది సెలబ్రిటీలు చిరు ఇంటికి వెళ్ళి మరీ.. అభినందించారు. ఇక దిల్ రాజు మెగస్టార్ కోసం ప్రత్యేకంగా మెగా ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు. 

click me!