
టాలీవుడ్ హీరో.. మంచువారి వారసుడు మనోజ్(Manchu Manoj) కు కరోనా పాజిటీవ్ అని తేలింది. విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు. అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకున్నారు.
టాలీవుడ్ లో మరో హీరో కోవిడ్ బారిన పడ్డారు. మంచువారబ్బాయి మనోజ్(Manchu Manoj) కు కోవిడ్ పాజిటీవ్ అని తేలింది. ఈ విషయాన్ని మనోజ్ స్వయంగా ప్రకటించారు. నాకు కోవిడ్ పాజిటీవ్ అని తేలింది. నా గురించి బాధపడకండి. నేను బాగానే ఉన్నాను.. కాని నన్ను ఈ మధ్యలో కలిసిన వారు టెస్ట్ చేయించుకోండి అని రిక్వెస్ట్ చేశారు మనోజ్,
నేను ఇప్పుడు సేఫ్ గానే ఉన్నాను మీ ప్రేమ.. ఆశ్వీర్వాదాల వల్ల నేను బాగానే ఉంటానన్నారు మనోజ్. అందరూ కోవిడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే టెస్ట్ చేయించుకోవాలి అన్నారు. ఈ సదర్భంగా నర్సులు,డాక్టర్లకు మంచు మనోజ్ ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. తనకు కోవిడ్ అని తెలియగానే ట్విట్టర్ లో ఇలా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు మంచు మనోజ్.
లాస్ట్ టైమ్ కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లలో చాలా మంది సెలెబ్రిటీలు కోవిడ్ బారిన పడ్డారు. ప్రస్తుతం కేసులు మళ్ళీ పెరుగుతున్న నేపథ్యంలో..ఒమిక్రాన్ భయం, థార్డ్ వేవ్ వస్తుందన్న సూచనల నేపథ్యంలో.. స్టార్టింగ్ స్టేజ్ లోనే కోవిడ్ బారిన పడ్డారు మంచు మనోజ్. టాలీవుడ్ లో ఈ మధ్యలో సెలెబ్రిటీలు ఎవరూ కోవిడ్ బారిన పడలేదు. కాని.. తమిళ ఇండస్ట్రీలో మాత్రం వరుసగా కోవిడ్ కేసులు వస్తున్నాయి.
Also Read : Samantha : ఫ్రీ బర్డ్ లైఫ్... సమంత కోరుకున్నది ఇదేనా?
రీసెంట్ గా కమెడియన్ వడివేలు కరోనాతో చెన్నైలోని ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఆయనకు ఒమిక్రాన్ వచ్చిందంటూ.. రూమర్స్ కూడా వినిపించాయి. అటు లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Hasan)తో పాటు తమిళ స్టార్ హీరో విక్రమ్(Vikram) కూడా కరోనా బారిన పడి రీసెంట్ గానే కోలుకున్నారు. ఇలా పక్క రాష్ట్రాల నుంచి స్టార్స్ చాలామంది కోవిడ్ తో ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు టాలీవుడ్ నుంచి మంచు మనోజ్ కూడా ఆ వరుసలో చేరారు.
Also Read : RRR Promotions: ట్రిపుల్ ఆర్ కు కొత్త పేరు పెట్టిన కపిల్ శర్మ.. రాజమౌళి ఏమన్నాడంటే..?