Bheemla Nayak update: భీమ్లా నాయక్ నుండి బ్లాస్టింగ్ అప్డేట్.. న్యూ ఇయర్ కి మోత మోగాల్సిందే!

Published : Dec 29, 2021, 11:53 AM IST
Bheemla Nayak update: భీమ్లా నాయక్ నుండి బ్లాస్టింగ్ అప్డేట్.. న్యూ ఇయర్ కి మోత మోగాల్సిందే!

సారాంశం

భీమ్లా నాయక్ (Bheemla Nayak)వాయిదా ఫ్యాన్స్ ని తీవ్ర నిరాశకు గురిచేసింది. పవర్ స్టార్ మూవీతో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవాలన్న వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లారు. అయితే వాళ్ళ కోపాన్ని అసహనాన్ని తగ్గించేందుకు భీమ్లా నాయక్ నుండి బ్లాస్టింగ్ అప్డేట్ విడుదల చేశారు. 

సంక్రాంతి కానుకగా జనవరి 12న భీమ్లా నాయక్ విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. అయితే అనంతరం ఆర్ ఆర్ ఆర్ జనవరి 7న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో భీమ్లా నాయక్ విడుదల వాయిదా వేయాలంటూ విజ్ఞప్తి చేశారు. దీనికి భీమ్లా నాయక్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ససేమిరా అన్నారు. అనుకున్న సమయానికే భీమ్లా నాయక్ విడుదల ఉంటుంది అంటూ.. ఫ్యాన్స్ కి హామీ ఇచ్చారు. 

దాదాపు నెల రోజుల సందిగ్ధత తర్వాత ఆర్ఆర్ఆర్ టీమ్ ఒత్తిడికి భీమ్లా నాయక్ యూనిట్ తలొగ్గడం జరిగింది. పెద్దల ప్రమేయంతో చేసేదేమీ లేక ఫిబ్రవరి 25కి పోస్ట్ పోన్ చేశారు. ఈ పరిణామం పవన్ ఫ్యాన్స్ ని తీవ్ర అసహనానికి గురిచేసింది. ముందుగా మనం సంక్రాంతి సీజన్ బుక్ చేసుకుంటే, ఆర్ఆర్ఆర్ కోసం వాయిదా వేసేది ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం పూర్తిగా నా చేయి దాటిపోయింది. పవన్ కళ్యాణ్ నిర్ణయంతోనే భీమ్లా నాయక్ విడుదల వాయిదా వేశాము అంటూ.. నిర్మాత నాగ వంశీ వివరణ ఇచ్చుకున్నారు. 

అయితే ఫ్యాన్స్ ఆగ్రహాన్ని తగ్గించేలా న్యూ ఇయర్ కానుక సిద్ధం చేశారు యూనిట్. ఫ్యాన్స్ న్యూ ఇయర్ సంబరాల కోసం భీమ్లా నాయక్ లోని '' లా లా భీమ్లా..' సాంగ్ డీజే వెర్షన్ విడుదల చేస్తున్నారు. డిసెంబర్ 31 సాయంత్రం 7:02 నిమిషాలకు లా లా భీమ్లా డీజే వర్షన్ విడుదల చేయనున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ ప్రకటన చేయడం జరిగింది. ఇక పవన్ ఫ్యాన్స్ 2022 నూతన సంవత్సర సంబరాల్లో 'లా లా భీమ్లా..' సాంగ్ డీజే వర్షన్ తో మోతమోగించనున్నారు. ఇది ఫ్యాన్స్ కి పర్ఫెక్ట్ న్యూ ఇయర్ గిఫ్ట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. 

Also read Bheemla Nayak in sankranti: ఆర్‌ఆర్‌ఆర్‌ వాయిదా?.. పండక్కి `భీమ్లా నాయక్‌` మోత మోగనుందా?

కాగా భీమ్లా నాయక్ మూవీలో పవన్ మరోమారు పోలీస్ రోల్ చేస్తున్నారు. హీరో రానా మరో కీలక రోల్ చేస్తున్నారు. మలయాళ హిట్ మూవీ అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్రానికి ఇది అధికారిక రీమేక్. దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్నారు. త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చారు. నిత్యా మీనన్ భీమ్లా నాయక్ లో పవన్ కి జోడిగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్
Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్