Manchu Manoj Counter: విష్ణుని టార్గెట్ చేసినందుకు... మంచు మనోజ్ స్టాంగ్ కౌంటర్ ఇచ్చిన ఆ వ్యక్తి ఎవరు..?

Published : Mar 22, 2022, 10:39 AM IST
Manchu Manoj Counter: విష్ణుని టార్గెట్ చేసినందుకు... మంచు మనోజ్ స్టాంగ్ కౌంటర్ ఇచ్చిన ఆ వ్యక్తి ఎవరు..?

సారాంశం

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే మంచు ఫ్యామిలీ ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సియల్ కామెంట్స్ చేస్తూనే ఉంటారు. రీసెంట్ గా మంచు మనోజ్ మా ఎలక్షన్స్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

రీసెంట్ గా మంచు ఫ్యామిలీకి చెందిన విద్యానికేతన్ 30వ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో మంచు ఫ్యామిలీ ఎప్పటిలాగానే తమ నోటికి పని చెప్పారు. అందులో మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారాన్ని  రేపుతున్నాయి. అది కూడా ఇప్పటి విషయం కాదు.. ఎప్పుడో మా ఎలక్షన్స్ టైమ్ లో జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. మనోజ్ కాంట్రవర్సియల్ కామెంట్స్ చేశారు. 

మా ఎన్నికల సమయంలో ఓ వ్యక్తి మంచు విష్ణుని కావాలని టార్గెట్ చేశారని, అన్నని మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూశారని ఆరోపిస్తూ మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. ఇప్పుడంతా ఎవరా వ్యక్తి? అని ఆరా తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అతని మాటలు అర్ధమైన వాళ్లు ఔరా అనుకుంటున్నారు. 

ఇంతకీ మంచు మనోజ్ ఆరోజు  ఏమన్నారంటే.. జీవిత లక్ష్యం కంటే ముందు.. ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయి విలువలు కలిగి ఉండాలి. ఈ విలువలు తెలియకపోతే.. వారి వల్ల పక్కన ఉన్నవాళ్లు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకు ఉదాహరణ ఇటీవల జరిగిన మా ఎన్నికలే. పోటీకి ఇద్దరు నిలబడినా.. పోటీ తర్వాత అందరూ ఒక్కటే. కానీ, ఓ వ్యక్తి అన్నయ్యని టార్గెట్ చేస్తూ.. మానసికంగా ఇబ్బంది పెట్టాలని ఎంతగానో ప్రయత్నించాడు అన్నారు. 

అంతే కుద అందులో భాగంగా మాకు సపోర్ట్ చేస్తున్నవారిని చిన్నా పెద్దా అని కూడా చూడకుండా.. ముఖ్యంగా తనకంటే పెద్దవాళ్లని కూడా కించపరిచేలా దూషించాడు. అప్పుడు నాన్నగారు ఎంతో ఓపిగ్గా.. వ్యవహరించారు. ఆ వ్యక్తిని పట్టించుకోకండి. అతనికి జీవిత లక్ష్యం అంటూ ఏమీ లేదు. అందుకే అలా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తుంటాడు అంటూ అన్నారని మనోజ్  తెలిపారు. ఆ వ్యక్తి చుట్టూ ఎందరో గొప్ప వ్యక్తులు ఉన్నారు.. అయినా కూడా ఆ వ్యక్తి ఎటువంటి జీవిత లక్ష్యం లేకుండా జీవిస్తున్నారు..అంటూ మనోజ్ వ్యాఖ్యలు చేశారు. 

మనోజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీని మరోసారి వేడెక్కిస్తున్నాయి. అటు జనాలు కూడా ఈ వ్యాఖ్యలపై ఎవరైనా స్పందిస్తారా..? లేక పేరు చెప్పలేదు కాబట్టి ఏమీ మాట్లాకుండా గమ్మున ఉంటారా అని ఎదురు చూస్తున్నారు. అటు ఫిల్మ్ నగర్ సర్కిల్ లో మాత్రం ఈ వాఖ్యాలపై గ్రూప్ డిస్కర్షనలు మొదలయ్యాయి.  మరి మంచు మనోజ్ చెప్పిన ఆ వ్యక్తి ఎవరో? ఈ మాటలకి అతను ఎలా రియాక్ట్ అవుతారో? తెలయాలంటే వెయిట్ చేయాల్సిందే. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?
Kalyan Padala Winner: కామన్ మ్యాన్‌దే బిగ్‌ బాస్‌ తెలుగు 9 టైటిల్‌.. బిగ్ బాస్‌ చరిత్రలో రెండోసారి సంచలనం