Dil Raju: మరోసారి తండ్రి కాబోతున్న దిల్ రాజు.. స్టార్ ప్రొడ్యూసర్ ఇంట సంబరాలు ?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 22, 2022, 09:55 AM IST
Dil Raju: మరోసారి తండ్రి కాబోతున్న దిల్ రాజు.. స్టార్ ప్రొడ్యూసర్ ఇంట సంబరాలు ?

సారాంశం

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరోసారి తండ్రి కాబోతున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజు తన మొదటి భార్య మరణం తర్వాత రెండవ వివాహం చేసుకున్నారు. 

దిల్ రాజు టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా రాణిస్తున్నారు. విజయవంతమైన చిత్రాలు నిర్మించడంలో దిల్ రాజుకు తిరుగులేదు. పక్కా ప్రణాళికతో దిల్ రాజు సినిమాలు నిర్మిస్తుంటారు. ఇదిలా ఉండగా దిల్ రాజు కుటుంబంలో కొత్త సంతోషాలు వెళ్లి విరిసినట్లు తెలుస్తోంది. దిల్ రాజు మరోసారి తండ్రి కాబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. 

దిల్ రాజు 2020లో తేజస్విని(వైగా రెడ్డి) ని రెండో వివాహం చేసుకున్నారు. కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం ప్రైవేట్ గా జరిగింది. ఈ దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తేజస్విని ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వస్తున్నాయి. 

దిల్ రాజు మొదటి భార్య అనిత అకాల మరణం చెందారు. దీనితో దిల్ రాజు తన కుమార్తె హన్షిత, ఇతర కుటుంబ సభ్యుల సలహాతో రెండవ వివాహం చేసుకున్నారు. టీడీల్ రాజు రెండవ భార్య తేజస్విని గర్భం దాల్చడంతో కుటుంబ సభ్యుల్లో సంతోషాలు వెళ్లి విరిసినట్లు తెలుస్తోంది. 

అయితే ఈ వార్తని దిల్ రాజు ఫ్యామిలీ అధికారికంగా ప్రకటించలేదు. ఇదిలా ఉండగా దిల్ రాజు ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల దిల్ రాజు తన సోదరుడు శిరీష్ కుమారుడు ఆశిష్ రెడ్డితో రౌడీ బాయ్స్ అనే చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు దిల్ రాజు మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో శంకర్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా చిత్రం నిర్మిస్తున్నారు. అలాగే తలపతి విజయ్, వంశీ పైడిపల్లి కాంబోలో కూడా ఒక చిత్రం రాబోతోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి
IMDb రేటింగ్ ప్రకారం 2025 లో టాప్ 10 సినిమాలు, సౌత్ సినిమాల ముందు తలవంచిన బాలీవుడ్