అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప" సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా మారిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ పాత్రలో కనిపించిన అల్లు అర్జున్ తన అద్భుతమైన నటనతో సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్లారు.
‘పుష్ప’ విడుదలై నెలలు గడుస్తున్నా అల్లు అర్జున్ ఇంట్లో సక్సెస్ సంబరాలకు పుల్ స్టాప్ పెట్టడం లేదు. లాస్ట్ వీకెండ్ లో ఆయన బావ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి పార్టీ ఇచ్చారు. మరోవైపు దర్శకుడు సుకుమార్ వెకేషన్‌కు వెళ్లాడు. వచ్చే నెలలో హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. అభిమానులు అందరూ ఈ సినిమాకి సెకండ్ పార్ట్ గా రాబోతున్న "పుష్ప: ది రూల్" గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినీ బిజినెస్ వర్గాలు సైతం ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అవుతుందో అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం రిలీజ్ విషయమై ఓ వార్త బయిటకు వచ్చి షాక్ ఇచ్చింది.
మొదటి అనుకున్న ప్లాన్ ప్రకారం ‘పుష్ప’ రెండవ భాగం ‘పుష్ప ది రూల్’ ఏప్రిల్‌లో రెగ్యులర్ షూట్‌ని ప్రారంభించి డిసెంబర్ 2022లో విడుదల చేయాలి. అందుకోసం స్క్రిప్టు కూడా రెడీ అయ్యిందని సమాచారం. అయితే, సుకుమార్ మరియు అల్లు అర్జున్ ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదికి తోయాలని నిర్ణయించుకున్నారు.
‘పుష్ప 2’ భారీ స్థాయిలో తెరకెక్కనుంది. అందుకోసం ప్రమోషన్స్ భారీగా చేయాలి. సరిగ్గా ప్లాన్ చేసి, బాగా అమలు చేయడానికి కనీసం ఒక సంవత్సరం అవసరం అని భావిస్తున్నారట. గతేడాది ‘పుష్ప’ విడుదల సమయంలో సుకుమార్, అతని టీమ్‌కి అనేక సమస్యలు ఎదురయ్యాయి. చాలా ప్రింట్‌లు పేలవమైన సౌండ్ మిక్సింగ్‌తో బయిటకు వెళ్లాయి. టెక్నికల్ సమస్యలు, అనవసర తలనొప్పులు రాకుండా ఉండేందుకు ఈ ఏడాది ‘పుష్ప 2’ విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నారు. సౌండి మిక్సింగ్ అస్సలు కుదర్లేదు. చాలా ప్రింట్స్ లో పేలవమైన సౌండ్ మిక్సింగ్ కనిపించింది. అదృష్టవశాత్తూ కంటెంట్ బాగుంది కాబట్టి, అవన్నీ కవర్ అయిపోయాయి. మరోవైపు గ్రాఫిక్స్ కూడా అక్కడక్కడ తేలిపోయాయి. ఆఖరి నిమిషంలో తలెత్తిన ఇలాంటి సమస్యల్ని పుష్ప-2 విషయంలో రిపీట్ చేయకూడదని యూనిట్ భావిస్తోంది.
మరో ప్రక్క పుష్ప సినిమా హిట్టవ్వడంతో పార్ట్-2పై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాల్ని అందుకోవాలంటే మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. ఆఖరి నిమిషంలో ఇబ్బందులు తగ్గించుకోవడం పాటు కాస్టింగ్ పై కూడా మరోసారి ఆలోచించుకోవాలి. కేజీఎఫ్ హిట్టవ్వడంతో, పార్ట్-2 కోసం సంజయ్ దత్, రవీనాటాండన్ లాంటి బాలీవుడ్ తారల్ని రంగంలోకి దించారు. పుష్ప-2 కోసం అలాంటి ప్రయత్నాలు చేయబోతున్నారు. కాబట్టి మరింత పకడ్బందీగా సినిమాను తీయాలంటే వచ్చే ఏడాది విడుదల పెట్టుకుంటేనే కరెక్ట్ అని అంటోంది ట్రేడ్.
అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప" సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా మారిన సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ పాత్రలో కనిపించిన అల్లు అర్జున్ తన అద్భుతమైన నటనతో సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్లారు. తెలుగులో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లను నమోదు చేసుకుంది. తెలుగులో కూడా అద్భుతమైన కలెక్షన్లతో ఈ సినిమా రికార్డులు సృష్టించింది. ఇక ప్రస్తుతం