''మంచి వ్యక్తుల వల్లే చెడ్డ నాయకులు''

Published : Apr 11, 2019, 10:56 AM ISTUpdated : Apr 11, 2019, 10:57 AM IST
''మంచి వ్యక్తుల వల్లే చెడ్డ నాయకులు''

సారాంశం

తెలుగు రాష్ట్రాలలో తొలిదశ సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. 

తెలుగు రాష్ట్రాలలో తొలిదశ సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణాలలో ఓటు వేయడానికి పోలింగ్బూత్ లకు క్యూ కడుతున్నారు ప్రజలు. సెలబ్రిటీలు సైతం తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు.

ఇప్పటికే అల్లు అర్జున్, చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్, నాగార్జున వంటి వారు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ అభిమానులను ఓటు వేయాలని కోరుతున్నారు. యంగ్ హీరో మంచు మనోజ్ ట్విట్టర్ లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

''మంచి వ్యక్తులు ఓటు వేయకపోవడం వలనే మన దేశంలో చెడ్డ నాయకులు ఎన్నికవుతారు.. దయచేసి ఓటు వేయండి'' అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన అభిమానులు తప్పకుండా ఓటు వేస్తామంటూ రిప్లయ్ పెడుతున్నారు.

నేచురల్ స్టార్ నాని కూడా జెంటిల్ రిమైండర్ అంటూ ట్విట్టర్ ద్వారా ప్రజలు ఓటు వేయాలని గుర్తు చేశారు. మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది, మన ఫ్యూచర్ బావుండాలంటే  మంచి నాయకులను ఎన్నుకోవాల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉందంటూ ప్రజలను చైతన్య పరుస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?