కొత్త రూల్స్.. 'మజిలీ'కి కలిసొస్తోంది!

By Udaya DFirst Published Apr 11, 2019, 10:13 AM IST
Highlights

ఈ మధ్యకాలంలో డిజిటల్ స్ట్రీమింగ్ హవా ఎక్కువవ్వడంతో ఇప్పుడు దానికి అడ్డుకట్ట వేస్తూ ఫిలిం ఛాంబర్ తీసుకున్న నిర్ణయం గురించి తెలిసిందే. 

ఈ మధ్యకాలంలో డిజిటల్ స్ట్రీమింగ్ హవా ఎక్కువవ్వడంతో ఇప్పుడు దానికి అడ్డుకట్ట వేస్తూ ఫిలిం ఛాంబర్ తీసుకున్న నిర్ణయం గురించి తెలిసిందే. ఇప్పటివరకు సినిమా రిలీజ్ అయిన 3 వారాలకే డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఇచ్చేసేవారు.

అమెజాన్ ప్రైమ్ లాంటి సంస్థలు అటువంటి ఒప్పందాలు కుదుర్చుకునేవి. దీంతో థియేటర్లలో ఆక్యుపెన్సీ తగ్గి బయ్యర్లకు నష్టాలు రావడం మొదలయ్యాయి. దీంతో ఇకపై మూడు వారాలకు డిజిటల్ స్ట్రీమింగ్ చేయడానికి వీలులేదని.. డిజిటల్ స్ట్రీమింగ్ చూడాలనుకునేవారు కచ్చితంగా 8 వారాలు ఆగాల్సిందేనని నిబంధనలు పెట్టారు.

ఈ రూల్స్ ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తాయని కూడా చెప్పారు. అలా కొత్త రూల్స్ పాటిస్తూ డిజిటల్ స్ట్రీమింగ్ లోకి రాబోతున్న మొదటి సినిమాగా 'మజిలీ' నిలిచింది. ఎనిమిది వారాలు లెక్కేసుకుంటే 'మజిలీ' సినిమా జూన్ 4న అమెజాన్ ప్రైమ్ లో దర్శనమిస్తుంది. సినిమాకు హిట్ టాక్ రావడంతో జనాలు థియేటర్లకు క్యూ కడుతున్నారు.

ఇప్పుడు అమెజాన్ లోకి రావడానికి కూడా టైం పడుతుందని తెలిసిన ప్రేక్షకులు థియేటర్లలోనే సినిమా చూడడానికి ఆసక్తి చూపుతున్నారు. ఒక్క అమెజాన్ ప్రైమ్ మాత్రమే కాదూ.. నెట్ ఫ్లిక్స్, జీ 5, ఐడియా మూవీస్ ఇలా వేటిలో కొత్త సినిమా చూడాలనుకున్నా ఇదే రూల్ వర్తిస్తుంది.  

click me!