'కమాన్ గ్లాస్ మేట్స్' ఓటేయండి: మెగాహీరో!

Published : Apr 11, 2019, 10:39 AM ISTUpdated : Apr 11, 2019, 10:53 AM IST
'కమాన్ గ్లాస్ మేట్స్' ఓటేయండి: మెగాహీరో!

సారాంశం

రెండు తెలుగు రాష్ట్రాలలో తొలిదశ సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. 

రెండు తెలుగు రాష్ట్రాలలో తొలిదశ సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణాలలో ఓటు వేయడానికి పోలింగ్బూత్ లకు క్యూ కడుతున్నారు ప్రజలు. సెలబ్రిటీలు సైతం తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు.

ఇప్పటికే అల్లు అర్జున్, చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్, నాగార్జున వంటి వారు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. మెగాహీరో సాయి ధరం తేజ్ కూడా ఓటేసి ప్రజలను తమ మావయ్య పార్టీ జనసేనకి ఓటు వేయాలంటూ పరోక్షంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

'కమాన్ గ్లాస్ మేట్స్' వెళ్లి ఓటేయండి.. అంటూ వేలిపై సిరా చుక్క ఉన్న ఫోటోని షేర్ చేశారు. మరో హీరో సుదీర్ బాబు ఓటేసిన అనంతరం ట్విట్టర్ లో పోస్ట్ పెడుతూ.. ''దయచేసి విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దు. ప్రజాస్వామ్య దేశం కోసం ఓటు హక్కుని వినియోగించుకోవడం ద్వారా నా డ్యూటీ పూర్తి చేశా.. మీరు వెళ్లి ఓటేయండి'' అంటూ రాసుకొచ్చాడు. 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?