పాన్ ఇండియా హీరో.. తేజ్ సజ్జా.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో తెలుసా..?

By Mahesh Jujjuri  |  First Published Aug 26, 2024, 9:34 PM IST

ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా సక్సెస్ ఫుల్ కెరీర్ ను కొనసాగిస్తున్నాడు తేజ్ సజ్జా.. గతంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా హిట్ సినిమాలు చేశాడు. మరి బాలనటుడిగా ఆయన సినిమాలకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో తెలుసా..? 


టాలీవుడ్ లో బాలనటులుగా ఇండస్ట్రీలోకి వచ్చి.. స్టార్ హీరోలుగా మారినవారు చాలామంది ఉన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్,  తరుణ్, కమల్ హాసన్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే.. లిస్ట్ చాలా ఉంది. అయితే ఈ కోవలోనే  తేజ సజ్జా కూడా చేరాడు.. టాలీవుడ్ కుర్ర హీరో..హానుమాన్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా కూడా మారాడు తేజ. వరుసగా మంచి మంచి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న ఈ హీరో.. గతంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా వరుస హిట్లు సొంతం చేసుకున్నాడు. 

అయితే తేజ సర్జ.. రీసెంట్ గా హిట్ పడటంతో రెమ్యూనరేషన్ పెంచాడు అన్న వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ కుర్రహీరో.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంత రెమ్యూనరేషన్ తీసుకుని ఉంటాడు అనేవార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. తేజ్ సజ్జ స్టార్ హీరోల సినమాల్లో నటించి మెప్పించాడు. స్టార్ హీరోలకు చిన్నప్పటి పాత్రలు చేశాడు. చిరంజీవి లాంటిస్టార్ హీరోకు కొడుకుగా కూడా నటించాడు తేజ. వరుసగా చూడాలని ఉంది, రాజకుమారుడు, బాచి, దీవించండి, కలిసుందాం రా..  ఇంద్ర లాంటి సూపర్ హిట్  సినిమాల్లో నటించి మెప్పించాడు తేజ. 

Latest Videos

ఇక ఇంద్రాలో అయితే.. తొడగొట్టి.. చెప్పిన డైలాగ్ కు మరింత పాపులర్అయ్యాడు తేజ సర్జ. ఈక్రమంలో తేజ సర్జ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుని ఉంటాడు అని అంతా ఇంట్రెస్టింగ్ గా సెర్చ్ చేస్తున్నారు. అయితే ఆయన అప్పట్లో రోజుకు 15 నుంచి 20 వేలు తీసుకునేవాడట. షూటింగ్ ఎన్ని రోజులు షూటింగ్ జరిగితే.. అన్ని రోజులు ఇలా రోజుకు 15 వేల వరకూ తీసుకున్నాడట. 

ఇక ఓ బేబితో హీరోగా మారిన తేజ సజ్జా.. ఆతరువాత జాంబిరెడ్డి, అద్భుతం, హానుమాన్ సినిమాలతో స్టార్ గా మారాడు. ఇక ఇప్పుడు తేజ డిమాండ్ కూడా పెరిగిపోయింది. దాంత సినిమాకు ఆయన దాదాపు 8 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం కథలు వింటు.. తొందర పడకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు తేజ. 

click me!