ఈ తరం పెళ్లిళ్లపై నరేష్ కామెంట్స్..అది అందరి లైఫ్ లో ఉంటుంది, నేను ఓపెన్ గా చెప్పేస్తా అంటూ..

By tirumala AN  |  First Published Aug 27, 2024, 6:46 AM IST

సీనియర్ నటుడు నరేష్ ప్రస్తుతం అద్భుతమైన క్యారెక్టర్ రోల్స్ తో రాణిస్తున్నారు. కానీ నరేష్ పేరు చెప్పగానే ఆయన పర్సనల్ లైఫ్ గుర్తుకు వస్తుంది. నరేష్ నాలుగు పెళ్లిళ్ల వ్యవహారం గురించే నెటిజన్లు ఎక్కువగా చర్చించుకుంటున్నారు.


సీనియర్ నటుడు నరేష్ ప్రస్తుతం అద్భుతమైన క్యారెక్టర్ రోల్స్ తో రాణిస్తున్నారు. కానీ నరేష్ పేరు చెప్పగానే ఆయన పర్సనల్ లైఫ్ గుర్తుకు వస్తుంది. నరేష్ నాలుగు పెళ్లిళ్ల వ్యవహారం గురించే నెటిజన్లు ఎక్కువగా చర్చించుకుంటున్నారు. నరేష్ కూడా తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పేందుకు ఏమాత్రం సంకోచించరు. 

నరేష్ వ్యక్తిగత జీవితంలో మూడు సార్లు పెళ్లి కలసి రాలేదు.ఇప్పుడు పవిత్ర లోకేష్ ని నాలుగో పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరూ ప్రస్తుతం రిలేషన్ లో ఉన్నారు. అయితే తాజాగా నరేష్ పెళ్లిళ్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్ ఇలా మాట్లాడడం విడ్డూరంగా ఉంది అంటూ సెటైర్లు పడుతున్నాయి. 

Latest Videos

పెళ్లిళ్లపై నరేష్ మాట్లాడుతూ.. ఈ తరం పెళ్లి వద్దు అంటోంది. ఇంతకు ముందు తరం పెళ్లి మరోసారి ట్రై చేయాలి అని అంటోంది. వీళ్ళ అభిప్రాయాలూ వేరైనా ఇద్దరి లక్ష్యం హ్యాపినెస్ కోసమే. నా విషయానికి వస్తే నేను ఈ రెండు తరాల మధ్యలో ఉన్నానని నరేష్ అన్నారు. 

పర్సనల్ లైఫ్ గురించి బోల్డ్ గా మాట్లాడడం నరేష్ కి అలవాటే. ఎప్పుడూ రెండు జంటల ప్రేమని పోల్చి చూడకూడదు. ప్రతి ప్రేమ దానికదే భిన్నంగా ఉంటుంది. రెండు జంటల ప్రేమలు ఎప్పుడూ ఒక్కటిగా ఉండవు అని అన్నారు. 

ప్రతి ఒక్కరి జీవితంలో లవ్ స్టోరీ ఉంటుంది. కానీ కొంత మంది ఓపెన్ అవ్వరు. తాను మాత్రం ఓపెన్ గా చెబుతానని నరేష్ అన్నారు. పవిత్రతో నా మనసు కలిసింది కాబట్టి పెళ్ళైపోయినట్లే అని నరేష్ తెలిపారు. 

click me!