అప్పుడే మా బాధ మీకూ తెలుస్తుంది

Published : Oct 06, 2017, 03:20 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
అప్పుడే మా బాధ మీకూ తెలుస్తుంది

సారాంశం

హైదరాబాద్ ట్రాఫిక్ పై స్పందించిన నటి మంచు లక్ష్మి ట్రాఫిక్ లో గంటన్నర పాటు ఇరుక్కుపోయిన మంచు లక్ష్మి ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసిన మంచు లక్ష్మి

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇక వర్షం పడిన రోజు ట్రాఫిక్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సమయంలో ట్రాఫిక్ లో ఇరుక్కుపోయామా ఇక అంతే సంగతులు. గంటలు గంటలు ఆ ట్రాఫిక్ లో నిరీక్షించాల్సిందే. ఇలాంటి సమస్య సామాన్య ప్రజలు ఏదో ఒక రోజు ఎదుర్కొంటూనే ఉన్నారు. తాజాగా ఇదే సమస్య నటి మంచు లక్ష్మి కూడా ఎదుర్కొన్నారట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.

 

నగరంలోని హైటెక్స్ ఏరియాలో  ఇటీవల నటి మంచు లక్ష్మీ ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. దీంతో 'గంటన్నర సమయం హైటెక్స్‌ ఏరియాలో ట్రాఫిక్ కారణంగా చిక్కుకున్నాను. రాజకీయ నాయకులు మాలాగ సాధారణ పౌరులుగా ఎలాంటి ప్రొటోకాల్ లేకుండా నగర రోడ్లపై ప్రయాణం చేస్తే ఏం జరుగుతుందో అర్థమవుతోందంటూ' ఆమె ట్వీట్ ద్వారా సమస్యను షేర్ చేసుకున్నారు. చాలామంది నెటిజన్లు ఆమెకు మద్ధతు తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan: పవన్ కళ్యాణ్, శ్రీలీల ఇద్దరి స్క్రీన్ ప్రజెన్స్ అదిరింది.. కానీ ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా ?
Rashmika Mandanna: స్వేచ్ఛనిచ్చే ప్రేమను వెతుక్కోండి.. రష్మిక మందన్న పోస్ట్ వైరల్