
హంసా నందిని ఓ సుదీర్ఘ సోషల్ మీడియా సందేశం ద్వారా తన హెల్త్ కండీషన్ పై అప్డేట్ ఇచ్చారు. ఆమెకు హెరిడిటరీ బ్రెస్ట్ క్యాన్సర్ పాజిటివ్(BRCA 1) గా తేలినట్లు తెలియజేశారు. జెనెటిక్ మ్యుటేషన్ కారణంగా నా జీవిత కాలంలో 70% బ్రెస్ట్, 40% అండాశ క్యాన్సర్ వచ్చే అవకాశం కలదు. ఈ సమస్య నుండి బయటపడడానికి సర్జరీలు చేయించుకోవాలి. మరోలా చెప్పాలంటే కీమోథెరపి, లుమ్పెక్టమి చేయించుకోవాలని హంస నందిని తెలియజేశారు.
ఇప్పటికే 9 కీమోథెరఫీ లో 9 దశలు పూర్తి చేశాను, మరో 7 సార్లు చేయించుకోవాల్సి ఉందని ని హంసా సందేశంలో పొందు పరిచారు. ఈ వ్యాధితో నేను క్రుగింపోనని ప్రామిస్ చేస్తున్నాను. దేనిని నేను సమర్థవంతంగా ఎదుర్కొని తిరిగి వెండితెరపై కనిపిస్తాను . ఈ మహమ్మారిని ఎదిరించి నిలబడవచ్చని అనేక మందికి తెలియజేస్తాను అని హంసా నందిని విశ్వాసం వ్యక్తం చేశారు.
37ఏళ్ళ హంసా నందిని ప్రస్తుతం పేరెంట్స్ తో పాటు పూణేలో ఉంటున్నారు.
నాలుగు నెలల క్రితం హంసా నందిని తన బ్రెస్ట్ లో చిన్న గడ్డను గుర్తించారట. అప్పుడే ఆమె మనసులో భయం మొదలైందట. అది బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చని ఆమె సందేహించారు. కారణం 18ఏళ్ల క్రితం హంసా నందిని మదర్ బ్రెస్ట్ కాన్సర్ తో మరణించారు. ఆమె సందేహాలు నిజం చేస్తూ.. ఆరోగ్య పరీక్షల్లో క్యాన్సర్ అని తేలింది. వంశపారంపర్యంగా హంసాకు ఈ క్యాన్సర్ సోకింది.
కొన్నాళ్లుగా నేను సోషల్ మీడియాకు, మిత్రులతో దూరంగా ఉంటుండగా అందరూ ఏమైంది అంటూ సందేశాలు పంపుతున్నారు. నా క్షేమం కోసం వాళ్ళ మీరు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు. దీని వలన భపడాల్సినది ఏమీ లేదు. ఎక్సపర్ట్ వైద్యుల పర్యవేక్షణలో నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. కాన్సర్ ని జయిస్తానన్న నమ్మకం నాకుందని... హంసా తన సందేశంలో పొందుపరిచారు.
Also read Akhanda: బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా మారని ఫేట్... అఖండ వలన ప్రగ్యా కు దక్కిందేమిటి!
2004లో విడుదలైన 'ఒక్కటవుదాం' అనే తెలుగు మూవీతో ఆమె వెండితెరకు పరిచయం అయ్యారు. 2018లో విడుదలైన గోపీచంద్ పంతం మూవీలో ఆమె చివరి సారిగా కనిపించారు. హంసా నందిని కెరీర్ మొత్తం టాలీవుడ్ లోనే సాగింది. ఆమె అనేక చిత్రాలలో గెస్ట్ రోల్స్ చేశారు. ఎన్టీఆర్ (NTR)త్రిపాత్రాభినయం చేసిన జై లవకుశ మూవీలో బ్యాంక్ ఎంప్లొయ్ పాత్రలో ఆమె మెరిశారు.
No matter what life throws at me, no matter how unfair it may seem, I refuse to play the victim. I refuse to be ruled by fear, pessimism, and negativity. I refuse to quit. With courage and love, I will push forward. pic.twitter.com/GprpRWtksC