మెగాస్టార్ పాటకు మంచు లక్ష్మి స్టెప్పులు, వైరల్ అవుతున్న వీడియో

Published : Dec 30, 2022, 11:57 AM ISTUpdated : Dec 30, 2022, 12:38 PM IST
మెగాస్టార్ పాటకు మంచు లక్ష్మి స్టెప్పులు, వైరల్ అవుతున్న వీడియో

సారాంశం

మంచు లక్ష్మీ డాన్స్ వేయడం కొత్తేం కాదు.. రకరకాల సందర్భాల్లో ఆమె డాన్స్ తో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసింది. కాని ఈసారి మాత్రం మెగాస్టార్ సాంగ్ కు అదరిపోయేలా స్టెప్పులేసింది స్టార్ యాక్ట్రస్. 

ప్రస్తుతం ఇండస్ట్రీలో మెగాస్టార్  చిరంజీవి  హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా రచ్చ రచ్చ చేస్తోంది. రిలీజ్ వరకూ మెగా అభిమానుల హడావిడి ఓ రేంజ్ లో ఉంటుంది. ఇక ఈమూవీ నుంచి బాస్ పార్టీ సాంగ్ విడుదలై సోషల్ మీడియాలో రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇప్పటికే యాభై మిలియన్లకు పైగా వ్యూస్ కూడా సాధించి రికార్డ్స్ బ్రేక్ చేసింది. అంతే కాదు సెలబ్రిటీల చేత కూడా కాలు కదిపిస్తుందీ సాంగ్. 

బాస్ పార్టీ పాటకు మెగా అభిమానులతో పాటు.. మంచు లక్ష్మీకూడా మాస్ డాన్స్ తో మంటలు పుట్టించింది. మంచు వారి అమ్మాయి మాస్ స్టెప్పులు వేసిన వీడియో సోషల్ మీడియాల్  వైరల్ అవుతుంది. ఈ వీడియోలోర జబర్ధస్త్ మాజీ కమెడియన్..  రంగస్థలం ఫేం మహేష్ కూడా ఉన్నారు. మహేష్ తో  పాటు మంచు లక్ష్మి  కలిసి వాల్తేరు వీరయ్య సినిమాలోని బాస్ పార్టీ అనే పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది.  

 

మంచువారమ్మయి చాలా ఎనర్జిటిక్ గా వేసిన  స్టెప్పులు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.  దాంతో సోషల్ మీడియాల  ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.ఇక లక్ష్మి మంచు డాన్స్ కి నెటిజన్స్ రకరకాల కామెట్లు చేస్తున్నారు. ఈసారి ఎక్కువగా పాజిటివ్ కామెంట్స్ కనిపిస్తున్నాయి. దాంతో మురిసిపోయిన మంచు..  ఈ కామెంట్స్ కి స్పందిస్తుంది కూడా. చిరంజీవి పాటలకు డాన్స్ చేయటం అంటే తనకు చాలా ఇష్టమని అందుకే ఆయన పాటలకు అప్పుడప్పుడు ఇలా డాన్స్ చేస్తూ ఉంటానని చెప్పుకొచ్చింది. 


ఇక ఇది ఇలా ఉంటే.. చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలో హీరోయిన్  గా శృతిహాసన్ నటించింది.  సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. బాబీ డైరెక్ట్ చేసిన ఈసినిమాపై భారీ అంచానాలు ఉన్నాయి. త్వరలో ఈ మూవీ ప్రిరిలీజ్ ఈవెంట్ ను వైజాగ్ లో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Top 5: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే.. ఒక్క లీక్‌తో లెక్కలన్నీ తారుమారు
2025లో ఘోరంగా ఫ్లాపైన 5 భారీ బడ్జెట్‌ సినిమాలు ఏవో తెలుసా?