వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు, తునివు ట్రైలర్ రిలీజ్ డేట్స్.. ఏదెప్పుడంటే?

By team teluguFirst Published Dec 30, 2022, 11:09 AM IST
Highlights

సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న చిత్రాల సందడి మొదలైంది. ఈసారి నాలుగు చిత్రాలు పోటీపడుతున్నాయి. పదిరోజుల్లో థియేటర్లలోకి రాబోతుండటంతో బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందుతున్నాయి. ఈ క్రమంలో ట్రైలర్స్ రిలీజ్ డేట్స్ అందాయి. 
 

తెలుగు ప్రేక్షకులకు బోలెడంత ఎంటర్ టైన్ మెంట్ అందించేందుకు టాలీవుడ్ సీనియర్ హీరోలు రెడీ అవుతున్నారు. ఈ సారి సంక్రాంతి కానుక వారినుంచే అందనుంది. ఫెస్టివల్ సందర్భంగా వచ్చే ఏడాది జనవరిలో ఏకంగా నాలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, నందమూరి బాలయ్య ‘వీరసింహారెడ్డి’, తమిళ స్టార్ తెలుగులో నటిస్తున్న డైరెక్ట్ ఫిల్మ్ ‘వారసుడు’, తమిళ హీరో అజిత్ కుమార్ నటించిన ‘తునివు’ సంక్రాంతికి పోటీపడుతున్నాయి.

మరోపదిరోజుల్లో ఒకటి రెండ్రోజులు  గ్యాప్ లో థియేటర్లలోకి రాబోతున్నాయి. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను ఇప్పటికే మొదలెట్టింది. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ కూడా అందిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో సినిమాల ట్రైలర్ రిలీజ్ డేట్స్ పై ఆసక్తి నెలకొంది. దీనిపై తాజా  అప్డేట్ అందింది.  ముందుగా అజిత్ కుమార్  (Ajith Kumar) నటించి ‘తునివు’ (Thunivu) చిత్ర ట్రైలర్ న్యూఈయర్ ట్రీట్ గా డిసెంబర్ 31న విడుదల కాబోతోంది.

తమిళ స్టార్ విజయ దళపతి డైరెక్ట్ గా తెలుగులో నటిస్తున్న ‘వారసుడు’ చిత్ర ట్రైలర్ జనవరి 01న ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. ఇక మోస్ట్ అవైటెడ్ Waltair Veerayya ట్రైలర్  ను జనవరి 4న విడుదల చేసుకుందుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు మాత్రం మాస్ సాంగ్ ‘పూనకాలు లోడింగ్’ రాబోతోంది. దీని కోసం ఇప్పటికే అభిమానులు ఎదురుచూస్తున్నారు. 

మరోవైపు నందమూరి నటసింహం, టాలీవుడ్ సీనియర్ నటుడు బాలయ్య నటిస్తున్న Veera Simha Reddy ట్రైలర్ పైనా భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఈ ట్రైలర్ జనవరి 6న విడుదల కాబోతోందని సమాచారం. ఇలా బ్యాక్ టు బ్యాక్ ట్రైలర్స్ విడుదల కావడంతో పాటు.. గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా జరగనున్నాయి. అయితే ఒకసినిమాతో మరోసినిమా క్లాష్ కాకుండా రిలీజ్ డేట్స్ లాక్ చేయడం విశేషం. జనవరి 11న ‘తునివు’ వస్తుండగా.. జనవరి 12న వారసుడు, వీరసింహారెడ్డి ఎంట్రీ ఇవ్వనున్నారు. మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 13న గ్రాండ్ గా విడుదల కానుంది.

click me!