Unstoppable with Prabhas: ఆ ఇద్దరు ప్రభాస్ ఆల్ టైం ఫేవరేట్ దర్శకులట... రాజమౌళి కాదు! 

Published : Dec 30, 2022, 11:00 AM IST
Unstoppable with Prabhas: ఆ ఇద్దరు ప్రభాస్ ఆల్ టైం ఫేవరేట్ దర్శకులట... రాజమౌళి కాదు! 

సారాంశం

అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్న ప్రభాస్ అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన డార్లింగ్ అభిమానులను నాన్ స్టాప్ ఎంటర్టైనర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఫేవరెట్ దర్శకులు ఎవరో వెల్లడించారు.   

ప్రభాస్ ఫేవరేట్ దర్శకులు అనగానే రాజమౌళి పేరు గుర్తుకు వస్తుంది. రాజమౌళి హీరో ప్రభాస్ కి మూడు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు. ఛత్రపతి మూవీతో ఫస్ట్ బ్లాక్ బస్టర్ ప్రభాస్ ఖాతాలో వేసుకున్నారు. ఇక బాహుబలి, బాహుబలి 2 చిత్రాల ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి 2 ఇండియా వైడ్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీగా రికార్డులకు ఎక్కింది. ఎన్టీఆర్ తర్వాత అత్యధికంగా రాజమౌళి మూడు సినిమాలు ప్రభాస్ తో చేశాడు. 

అయితే ప్రభాస్(Prabhas) ఆల్ టైం ఫేవరేట్ డైరెక్టర్స్ లిస్ట్ లో రాజమౌళికి స్థానం దక్కలేదు. సీనియర్ డైరెక్టర్ బాపు, మణిరత్నం తనకు ఇష్టమైన దర్శకులుగా ప్రభాస్ చెప్పారు. మణిరత్నం మూవీలో అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని ప్రభాస్ చెప్పుకొచ్చారు. బాపు పేరు చెప్పడం వెనుక ప్రత్యేక కారణం ఉంది. దర్శకుడు బాపు ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజుతో చేసిన భక్త కన్నప్ప చిత్రం టాలీవుడ్ క్లాసిక్స్ లో ఒకటిగా రికార్డులకెక్కింది. భారీ విజయం సాధించిన భక్త కన్నప్ప భారీ విజయం సాధించింది. అలాగే అనేక అవార్డులు, రివార్డులు సాధించింది. 

భక్త కన్నప్ప చిత్రాన్ని ప్రభాస్ చేస్తే చూడాలని ఉందని కృష్ణంరాజు పలు సందర్భాలు మనసులో కోరిక బయటపెట్టారు. ఈ క్రమంలో బాపు తన ఆల్ టైం ఫేవరేట్ దర్శకుడిగా ప్రభాస్ చెప్పి ఉండవచ్చు. కాగా అన్ స్టాపబుల్ వేదిక అనేక ఆసక్తికర విషయాలు చర్చకు వచ్చాయి. ప్రభాస్ త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడని చరణ్(Ram Charan) చెప్పడం ఆసక్తి రేపింది. ప్రభాస్ గురించి ఎవరికీ తెలియని ఒక విషయం చెప్పాలని హోస్ట్ బాలకృష్ణ ఫోన్ లో చరణ్ ని అడిగారు. దానికి సమాధానంగా త్వరలో ప్రభాస్ పెళ్లి ప్రకటన చేశారని హింట్ ఇచ్చాడు. 

చెప్పిన తేదీకి ఒకరోజు ముందే అన్ స్టాపబుల్ ప్రభాస్ ఎపిసోడ్ పార్ట్ 1 ప్రసారం చేశారు. ఒక్కసారిగా ఆడియన్స్ పోటెత్తడంతో ఆహా యాప్ క్రాష్ అయ్యింది. అనుకున్న సమయానికి ఆడియన్స్ షో చూడలేకపోయారు. సాంకేతిక లోపాలతో యాప్ పని  లేదని ఆహా టీమ్ సోషల్ మీడియాలో వివరణ ఇచ్చారు. అర్ధరాత్రికి ప్రభాస్-బాలకృష్ణ(Balakrishna)ల ఎపిసోడ్ ప్రసారం అయ్యింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Divvala Madhuri అసలు రూపం బయటపెట్టిన రీతూ చౌదరీ తల్లి.. అన్‌ ఫెయిర్‌ ఎలిమినేషన్‌
Renu Desai ని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? బద్రి కంటే ముందే ఇంత కథ జరిగిందా?