మంచు లక్ష్మిపై ప్రశ్నల వర్షం, ఈడీ విచారణకు హాజరైన నటి.

Published : Aug 13, 2025, 03:22 PM IST
Lakshmi Manchu

సారాంశం

బెట్టింగ్ యాప్స్ కేసులో వరుసగా స్టార్స్ విచారణకు హాజరవుతుండగా, తాజాగా మంచు లక్ష్మి ఈడీ విచారణ కోసం ఆఫీస్ కు వచ్చారు.

ఈడీ విచారణకు మంచు లక్ష్మి

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌ విదషయంలో ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఎంతో మంది స్టార్స్ పై కేసు నమోదు అయిన క్రమంలో, కొంత మంది స్టార్స్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈక్రమంలోనే ఒక్కొక్కరుగా సెలబ్రిటీలు విచారణకు హాజరవుతున్నారు. బెట్టింగ్ యాప్స్ కు సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో భాగంగా నటి, నిర్మాత మంచు లక్ష్మీ ప్రసన్న బుధవారం హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.

ఉదయం 10:30 గంటలకు మంచు లక్ష్మీ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయడం, దాని కోసం వారు చేసుకున్న ఒప్పందాలు, రెమ్యునరేషన్, ఆర్ధిక సబంధమైన విషయాలు, ఇలా రకరకాల లావాదేవీలపై ఈడీ అధికారులు మంచు లక్ష్మిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అంతే కాదు ఈ విషయంలో మంచు లక్ష్మి నుంచి వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేసే అవకాశం కూడా ఉన్నట్టు సమాచారం.

బెట్టింగ్ యాప్ కేసులో స్టార్స్

బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినందుకు గాను ఇప్పటికే దాదాపు 29 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు ఈడీ అధికారులు. ఈ కేసులో వెండితెర, బుల్లితెర స్టార్స్ తో పాటు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెంజర్లు కూడా ఉన్నారు. వారిలో కొంత మంది సెలబ్రిటీలకు మాత్రమే ఈడీ నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరవ్వాలని ఆదేశించారు. కాని కొంత మంది స్టార్స్ మాత్రం తమకు షూటింగ్స్ ఉండటం వల్ల విచారణ కోసం ఇచ్చిన తేదీల్లో హాజరుకాలేమంటూ సమాధానం పంపించారు.

విచారణకు హాజరైన ప్రముఖులు

ఇప్పటికే ఈ కేసులో ప్రముఖ నటులు ప్రకాశ్ రాజ్ జులై 30న ఈ డీ విచారణకు హాజరయ్యారు. ఇక మీద బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయనని ఆయన వెల్లడించారు. , ఆతరువాత ఆగస్ట్ 6న విజయ్ దేవరకొండ విచారణకు వచ్చారు. అయితే ఆయన తాను బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయలేదని, తాను గేమ్ యాప్ లను మాత్రమే ప్రమోట్ చేశానన్నారు. ఇక మరో సెలబ్రిటీ రానా దగ్గుబాటి కూడాఆగస్టు 11 ఈడీ అధికారుల ఎదుట హాజరై తమ వివరణ ఇచ్చారు. వారిని సైతం అధికారులు సుమారు 4 నుంచి 5 గంటల పాటు విచారించారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నమోదైన ఐదు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ ఈ కేసులో దర్యాప్తు చేస్తోంది. పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్-1867ను ఉల్లంఘించి, అక్రమ బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించారన్న ఆరోపణలతో సుమారు 29 మంది నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద కేసు నమోదు చేసింది.

 

సెలబ్రిటీస్ ఏమంటున్నారంటే?

గతంలో కూడా కొంత మంది స్టార్స్ విచారణకు హాజరయ్యారు. అయితే వారి వాదన ఎలా ఉందంటే తాము కేవలం చట్టబద్ధంగా అనుమతి పొందిన ఆన్‌లైన్ స్కిల్-బేస్డ్ గేమ్‌లను మాత్రమే ప్రమోట్ చేశామని, అవి బెట్టింగ్ యాప్స్ గా ఎలా పరిగణలోకి వస్తాయని ప్రశ్నిస్తున్నారు. రానా, విజయ్ దేవరకొండ కూడా ఇదే చెప్పినట్లు తెలిసింది. మరోవైపు, తాను ఒక గేమింగ్ యాప్‌నకు ప్రచారం చేసినప్పటికీ, మనస్సాక్షి అంగీకరించక ఎలాంటి పారితోషికం తీసుకోలేదని ప్రకాశ్ రాజ్ ఈడీకి వివరించారు. ఇప్పటి వరకు అయితే ఈడీ నోటీసులు ఇచ్చినవారి వరకూ విచారణకు వచ్చారు. ఇక ముందు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఏం చేస్తుందో చూడాలి.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Suriya: కంగువతో విమర్శలు, హ్యాట్రిక్ హిట్లు కొట్టేందుకు ప్లాన్.. సూర్య చేస్తున్న 3 సినిమాలు ఇవే
OTT : 2025లో అత్యధికంగా చూసిన 10 వెబ్ సిరీస్‌లు, IMDb ర్యాంకింగ్స్