
ఈ సారీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బ్లాక్‌బస్టర్ సినిమాల హంగామా జరగబోతోంది. రెండు భారీ బడ్జెట్ సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యి ఆకట్టుకోబోతున్నాయి. సూపర్‌స్టార్ రజనీకాంత్, నాగార్జున, ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన రెండు భారీ చిత్రాలు ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
మొదటగా, రజినీకాంత్ ప్రధాన పాత్రలో "కూలీ" సినిమా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతోంది. రజినీకాంత్ తో పాటు టాలీవుడ్ స్టార్ నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, మలయాళ స్టార్ శోబిన్ లాంటి స్టార్ కాస్ట్ ఈ సినిమాలో సందడి చేయబోతున్నారు. మరీ ముఖ్యంగా టాలీవుడ్ కింగ్ నాగార్జున నెగటివ్ పాత్ర పోషించినట్టు సమాచారం. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈసినిమాలో ప్రమోషన్ వీడియోస్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నెట్టింట్లో “Monica Song” సెన్సేషన్ క్రియేట్ చేసింది. ట్విట్టర్, యూట్యూబ్ లో మోనికా సాంగ్ రచ్చ రచ్చ చేసింది. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, పోస్టర్స్, ట్రైలర్స్ లో విజ్యువల్స్ ఆకట్టుకుంటున్నాయి.
రెండో చిత్రం “వార్ 2”లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లాంటి స్టార్స్ నటించిన ఈసినిమాపై కూడా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ రెండు చిత్రాలు ఆగస్టు 14 గురువారం విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. రిలీజ్ కు ముందు అడ్వాన్స్ టికెట్ బుకింగ్ కు భారీగా స్పందన కూడా వస్తోంది. దేశవ్యాప్తంగా సినీ ప్రియులు, టికెట్ పోర్టల్స్ రెడీగా ఉన్నాయి. టికెట్ బుకింగ్స్ కు కూడా భారీగా స్పందన లభిస్తోంది. కొన్ని సైట్స్ లో సోల్డ్ అవుట్ చూపిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక మరొక విశేషం ఏంటంటే రజినీకాంత్ కూలీ క్రేజ్ ఎంతలా ఉందంటే.. యూనో ఆక్వా కేర్ అనే కంపెనీ తమ ఉద్యోగులకు భారీ ఆఫర్ ప్రకటించింది. "కూలీ" సినిమా రిలీజ్ రోజున అభిమాని స్ఫూర్తిలో తమ సంస్థ సెలవు ప్రకటించింది. దీని అదనంగా, చెన్నై, బెంగళూరు, తిరుచ్చి, తిరునెల్వేలి, చెంగల్పట్టు, మాట్టుత్తావణి, ఆరప్పాళెయం వంటి నగరాలలోని తమ శాఖల ఉద్యోగులకు ఉచితంగా సినిమా టికెట్లు, శుభాకాంక్షల తో స్వీట్లు పంపించారు, అలాగే ఆశ్రమాలకు విరాళాలు అందజేశారు.
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాంతో ఇతర కంపెనీల ఉద్యోగులు కూడా “మాకు కూడా ఒక సెలవు కూడా ఇవ్వండి, బాస్సూ” అంటూ నెట్టింట్ కామెంట్లు పెడుతున్నారు.ఇక “కూలీ” – “వార్ 2” ట్రైయాంగిల్ లో తమిళ, తెలుగు, హిందీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోబోతున్నాయి. మరి ఈసినిమాల రిజల్ట్ ఎలా ఉంటుంది. ఏ సినిమాకు ఎక్కువ రెస్పాన్స్ వస్తుందో చూడాలి.