
ఈవారం అగస్ట్ 14న రెండు భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఆ రెండు డబ్బింగ్ సినిమాలే కావడం విశేషం. రెండు పెద్ద సినిమాలు, అందులోను రెండు సినిమాల్లో ఇద్దరు తెలుగు స్టార్ హీరోలు నటించడంతో, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమాపై భారీగా బజ్ ఏర్పడింది. ఈసినిమాల్లో ఒకటి రజినీకాంత్ కూలీ కాగా, మరొకటి హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ కాంబో మూవీ వార్ 2. ఈ రెండు సినిమాల రిలీజ్ తో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కూడా సందడి నెలకొంది.
ఆగస్టు 14 న విడుదలయ్యే ఈ రెండు భారీ సినిమాలు తమిళ నుంచి లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్, నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన మూవీ కూలీ. ఈసినిమాపై సౌత్ లో భారీ అంచనాలు ఉన్నాయి. నాగార్జున మొదటి సారి విలన్ గా కనిపించనుండటంతో తెలుగు ప్రేక్షకుల్లో ఈసినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. దాంతో ఆడియన్స్ పెద్ద ఎత్తున ఈసినిమా చూడటానికి ఎదురుచూస్తున్నారు.
మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమా తరువాత తన ఫ్యాన్స్ ముందుకు తీసుకువస్తున్న సినిమా వార్ 2. ఈసినిమాతో తారక్ మొదటిసారి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో బ్రహ్మాస్త్రా డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈసినిమాపై తెలుగువారి ఆశలు ఎంతో ఉన్నాయి. తారక్, హృతిక్ యాక్షన్ సీన్స్ కోసం ప్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాల రిలీజ్ పై ఫ్యాన్స్ ఆగ్రహంతో ఉన్నారు. అది కూడా టికెట్ ధరల విషయంలో.
ఈ రెండు చిత్రాలు తెలుగు రాష్ట్రాల్లో డబ్బింగ్ వర్షన్లుగా రిలీజ్ అవుతున్నాయి. ఈక్రమంలో ఈ సినిమాల టికెట్ ధరలు అనవసరంగా పెంచడం పై ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు రెండూ..ఈ రెండు డబ్బింగ్ సినిమాల కోసం ప్రత్యేకంగా టికెట్ రేట్లు పెంపునకు అనుమతినిచ్చడంతో, మల్టీప్లెక్స్‌లలో టికెట్లు 300 నుంచి 550 వరకు ఉండనున్నాయి. అయితే ఒరిజినల్ మార్కెట్లో ఉన్న ధరల కంటే ఇవి చాలా ఎక్కువ అని ప్రేక్షకులు విమర్శలు చేస్తున్నారు
రజినీకాంత్, నాగార్జున కూలీ కోసం చెన్నైలో టికెట్ ధర 150‑200 వరకు ఉన్నా, హైదరాబాద్‌లో అది 400 దాటిపోయింది. అలాగే, ఎన్టీఆర్, హృతిక్ వార్ 2 హిందీ వర్షన్ కు 180‑250 మధ్యమాత్రమే టికెట్ ధర ఉండగా, తెలుగు డబ్బింగ్ కోసం 400‑500 వరకు పెంచుకోవడానికి అనుమతులు తీసుకున్నారు. దాంతో ఈ పరిస్థితులపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తీవ్రంగా స్పందిస్తున్నారు. ఘాటుగా స్పందిస్తున్నారు.
ఈ సినిమా రేట్లకు సబంధించి పొలిటికల్ గా కూడా విమర్శలు వచ్చాయి. దర్శకులు, నిర్మాతలు ‘సినిమా రక్షణ’ గురించి మాట్లాడుతున్నారే తప్పించి.. ప్రేక్షకులను అధిక ధరలతో ఇబ్బందిపెడుతున్నామన్న ఆలోచన లేకుండా పోయింది అని విమర్శలు వస్తున్నాయి. అంతే కాదు, అమెరికాలో తెలుగు వర్షన్ల కోసం కూడా టికెట్ రేట్లు పెరిగాయని అక్కడి తెలుగు ప్రేక్షకులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు