దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 4 న విడుదలైన `మంచి రోజులు వచ్చాయి` చిత్రానికి డీసెంట్ కలెక్షన్స్ వస్తున్నాయి. `తొలిరోజు నుంచే యునానిమస్ పాజిటివ్ టాక్ తో `మంచి రోజులు వచ్చాయి` బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది.
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన `మంచి రోజులు వచ్చాయి`(Manchi Rojulochaie) చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. మ్యాజికల్ హిట్‌గా ముందుకు సాగుతుంది. కలెక్షన్ల పరంగానూ సత్తా చాటుతుంది. అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రజనీకాంత్ `పెద్దన్న` సినిమాలకు పోటీగా రన్ అవుతుండటం విశేషం. వరుస విజయాలతో మంచి పేరుతెచ్చుకున్న దర్శకుడు మారుతి.. అద్భుతమైన కాన్సెప్ట్ లతో మంచి విజయాలు అందుకున్న యూవీ కాన్సెప్ట్స్.. విభిన్నమైన కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వి సెల్యూలాయిడ్ SKN.. కాంబినేషన్ లో వచ్చిన సినిమా Manchi Rojulochaie.
దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 4 న విడుదలైన ఈ సినిమాకు డీసెంట్ కలెక్షన్స్ వస్తున్నాయి. `తొలిరోజు నుంచే యునానిమస్ పాజిటివ్ టాక్ తో `మంచి రోజులు వచ్చాయి` బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. వినోదంతో పాటు అద్భుతమైన సందేశం అందించే విధంగా దర్శకుడు మారుతి(Maruthi) రాసుకున్న కథ ప్రేక్షకులకు బాగా చేరువవుతుంది. దానికి తోడు ఆకట్టుకునే స్క్రీన్ ప్లే మంచి రోజులు వచ్చాయి సినిమా స్థాయిని పెంచింది. ఆరోగ్యకరమైన కామెడీతో పాటు మనసును తాకే ఎమోషనల్ సన్నివేశాలు `మంచి రోజులు వచ్చాయి` సినిమాలో ఉన్నాయి.
undefined
వీటన్నింటినీ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హీరో సంతోష్ శోభన్, మెహరీన్ కౌర్(Mehreen) మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు.. లవ్ స్టోరీ.. వాళ్ల కెమిస్ట్రీ అద్భుతంగా వర్కవుట్ అయింది. అజయ్ ఘోష్ నటన సినిమాకు ప్రధాన బలంగా మారింది. సుదర్శన్, సప్తగిరి, వెన్నెల కిషోర్జ్ ప్రవీణ్, వైవా హర్ష కామెడీ సీన్స్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉన్నాయి. ఇక యూవి కాన్సెప్ట్స్, వి సెల్యూలాయిడ్ SKN ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా సినిమా స్థాయిని పెంచాయి.
ఇవన్నీ ఒక చోట చేరి మారుతి నమ్మకాన్ని నిలబెట్టాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మంచి సరదా సినిమా చూడాలి అనుకునే ప్రేక్షకులకు మంచి రోజులు వచ్చాయి కంటే బెస్ట్ ఆప్షన్ మరొకటి లేదు అంటున్నారు ప్రేక్షకులు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దీపావళి రోజు విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతుంది. ఈ సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు చిత్ర యూనిట్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు` తెలిపారు.
also read: RRR Big update: `నాటు నాటు` అంటోన్న ఎన్టీఆర్, రామ్‌చరణ్.. `ఆర్ఆర్ఆర్` సెకండ్ సింగిల్