
ఎన్నాళ్ళుగానో అభిమానులు ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ట్రిపుల్ ఆర్ రిలీజ్ తో పాటు.. అక్కడక్కడ కొన్ని బాధాకరమైన విషయాలు కూడా జరుగుతున్నాయి. ట్రిపుల్ ఆర్ చూస్తూ ఓ అభిమాని ఏకంగా ప్రాణాలే కోల్పోయిన ఘనట జరిగింది.
దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. అభిమానులను అలరిస్తోంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్ గా ఈ సినిమా ఈ రోజు (మార్చి 25) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ట్రిపుల్ ఆర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి పాజిటీవ్ టాక్ వస్తోంది.
ఇక అన్ని థియేటర్లలో మెగా నందమూరి అభిమానులు సందడి చేస్తున్నారు. అక్కడక్కడా అభిమానుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు..చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉన్నాయి. టికెట్ల విషయంలో పోటాపోటీగా అభిమానులు నువ్వా నేనా అన్నట్టు ప్రవర్తిస్తున్నారు కొన్ని చోట్ల. చిత్తూరు జిల్లాలో టికెట్లు చించేసిన సంఘటనలు కూడా జరిగాయి. ఈ క్రమంలోనే ట్రిపుల్ ఆర్ చూస్తూనే ఓ అభిమాని ప్రాణాలు కోల్పోయిన సంఘటన జరిగింది.
అనంతపురం ప్రాంతంలో విషాదం నెలకొంది. థియేటర్ లో ఆర్ఆర్ఆర్ సినిమా చూస్తూ గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చెందారు. ఎస్ వీ మ్యాక్స్ థియేటర్లో ఆర్ఆర్ఆర్ సినిమా బెనిఫిట్ షోలు వేయడంతో ఓబులేసు(30) అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి ప్రీమియర్ షోకి వెళ్లాడు. సినిమా చూస్తున్న సమయంలో అతడికి గుండెపోటు వచ్చింది.
దీంతో వెంటనే ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కి తరలించారు. కానీ మార్గమధ్యలోనే అతడు మృతి చెందినట్లు కిమ్స్ వైద్యులు నిర్ధారించారు. తమ అభిమాన స్టార్ సినిమా చూస్తు.. వాటిని తన ఫోన్ లో వీడియోలు, ఫోటోలు తీస్తూ.. సడెన్ గా అతను కుప్పకూలిపోయినట్టు.. అతని స్నేహితులు చెపుతున్నారు. మరి ఈ సంఘటనపై ట్రిపుల్ ఆర్ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.