Shraddha Kapoor: షాకింగ్.. ప్రియుడితో స్టార్ హీరోయిన్ బ్రేకప్ ?

Published : Mar 25, 2022, 10:56 AM ISTUpdated : Mar 25, 2022, 11:01 AM IST
Shraddha Kapoor: షాకింగ్.. ప్రియుడితో స్టార్ హీరోయిన్ బ్రేకప్ ?

సారాంశం

ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనె, అనుష్క శర్మ వీరంతా లవ్ మ్యారేజెస్ చేసుకున్నారు. మరో స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ కూడా అదే బాటలో పయనిస్తోందని భావించారు. 

చిత్ర పరిశ్రమలో నటీనటుల మధ్య ప్రేమ వ్యవహారాలు సహజంగా జరుగుతుంటాయి. బాలీవుడ్ లో లవ్ ఎఫైర్స్ గురించి ఎక్కువగా వింటుంటాయి. చాలా మంది స్టార్ హీరోయిన్లు బాలీవుడ్ లో ప్రేమ వివాహాలు చేసుకున్నారు. ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనె, అనుష్క శర్మ వీరంతా లవ్ మ్యారేజెస్ చేసుకున్నారు. మరో స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ కూడా అదే బాటలో పయనిస్తోందని భావించారు. 

అయితే శ్రద్దా కపూర్ ఎప్పుడూ అఫీషియల్ తన ప్రేమ గురించి బయట పెట్టలేదు. కానీ ఆమె చాలా కాలంగా సెలెబ్రిటీ ఫోటో గ్రాఫర్ రోహన్ శ్రేష్టతో ఘాడమైన ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. బాలీవుడ్ లో కూడా వీరిద్దరి లవ్ అఫైర్ గురించి చర్చ జరిగింది. ఈ ఏడాది ఆరంభం నుంచి వీరిద్దరి వివాహంపై రూమర్స్ వస్తూనే ఉన్నాయి. 

శ్రద్దా కపూర్, రోహన్ ఇద్దరూ త్వరలో పెళ్ళికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఊహించని విధంగా ఈ జంట విడిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన శ్రద్దా కపూర్ బర్త్ డే కి రోహన్ హాజరు కాలేదట. కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డట్లు బాలీవుడ్ మీడియా తెలిపింది. 

ఖాళీగానే ఉన్నప్పటికీ శ్రద్దా కపూర్ బర్త్ డేని రోహన్ అవాయిడ్ చేసాడట. అంతటితో ఇద్దరి విడిపోవాలని నిర్ణయించుకునంట్లు ప్రచారం జరుగుతోంది. తన లవ్ అఫైర్ బ్రేకప్ గురించి రూమర్స్ వస్తున్న సమయంలో శ్రద్దా కపూర్ చేసిన ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ లో ప్రశాంతంగా ఉన్న తన పిక్ షేర్ చేసింది. అలాగే 'ఔర్ సునావో' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. 

శ్రద్దా కపూర్.. ప్రభాస్ సాహో చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సాహో చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. 

 

PREV
click me!

Recommended Stories

రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?
Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?