RRR Team In RTC Bus : ఆర్టీసీ బస్సులో ఆర్ఆర్ఆర్ టీం.. సీపీ సజ్జనార్ కు రాజమౌళి ధన్యవాదాలు..

By team teluguFirst Published Mar 25, 2022, 11:08 AM IST
Highlights

బిగ్ మల్టీ స్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ RRRకు తెలంగాణ ప్రభుత్వం ముందునుంచే ప్రత్యేకంగా సహకరిస్తోంది. తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సహకరించగా.. ఎస్ఎస్ రాజమౌళి, ఆర్ఆర్ఆర్ టీం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మ్యానియా నడుస్తోంది. ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ మాటే వినిపిస్తోంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సినిమాలంటే ప్రేక్షకులకు హై ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. థియేటర్ల నిండా ఆడియెన్స్ నిండిపోవడం ఖాయం. దీంతో సినిమా హాళ్ల వద్ద రద్దీ ఎక్కువగా ఉంటుంది. మరోవైపు ఫ్యాన్స్ తో కలిసి మూవీ స్టార్ కాస్ట్ కూడా సినిమాను చూడాలనుకోవడంతో ఆర్టీసీ సంస్థ ప్రత్యేకంగా ‘ఆర్ఆర్ఆర్’ టీం కోసం ఏసీ బస్సును అరేంజ్  చేసింది.  వారిని సురక్షితంగా తీసుకెళ్లి.. సురక్షితంగా తీసుకొచ్చేందుకు సీనియర్ డైవర్, సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచినట్టు తెలుస్తోంది. ప్రీమియర్ షో మొదలు ఇప్పటి వరకు ‘ఆర్ఆర్ఆర్’టీం ఆర్టీసీ బస్సులోనే థియేటర్ల వద్దకు వెళ్తున్నారు. 

థియేటర్ విసిట్ కోసం ఏర్పాట్లు చేసిన ఈ ఆర్టీసీ (RTC) బస్సులో దర్శకుడు రాజమౌళి (SS Rajamouli), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), సినిమాకు సంబంధించిన ముఖ్యులు ప్రయాణిస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ మూవీ కోసం  తెలంగాణ ప్రభుత్వం ముందు నుంచే బాగా సహకరిస్తోంది. ఇటీవల టికెట్ల రేట్ల విషయంలోనూ, బెనిఫిట్ షోల విషయంలోనూ, తదితర అనుమతులను  అడిగిన వెంటనే ఇస్తూ వచ్చింది. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ టీం సెఫ్టీని ఉద్ధేశించి ఆర్టీసీ సంస్థ ప్రత్యేకంగా ఏసీ బస్సులను కూడా ఏర్పాటు చేసింది. ఇందుకు డైరెక్టర్ రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ (NTR) ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ (VC Sajjanar)కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిరంతరంగా మీరు సహకరించడాన్ని మేము గౌరవిస్తున్నాం అంటూ ట్వీట్ చేశారు. 

Latest Videos

 

Thank you V.C. Sajjanar sir for arranging TSRTC buses for our team to watch tomorrow 🤗 We will forever cherish your continuous support...

— RRR Movie (@RRRMovie)

ఇక ఆర్ఆర్ఆర్ మూవీ ఊహించినట్టే బ్లాక్ బాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఓవైపు అభిమానులు సినిమాను ఎంజాయ్ చేస్తుంటే..  మరోవైపు ఆర్ఆర్ఆర్ స్టార్ కాస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్రేక్షకులతో కలిసి సినిమా చూస్తున్నారు. ఆడియెన్స్ నుంచి వస్తున్న టెర్రిఫిక్ రెస్పాన్స్ ను రామ్ చరణ్, రాజమౌళి, ఎన్టీఆర్ దగ్గరగా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే హౌజ్ ఫుల్ బోర్డులతో ఆర్ఆర్ఆర్ తొక్కుకుంటూ పోతోంది. అయితే ఓపెనింగ్ ఎలా ఉండనుందనేది ఆసక్తిగా ఉంది. మరోవైపు  ఇప్పటికే యూఎస్ఏలో 3.5 మిలియన్ల డాలర్ల వసూల్ చేయనున్నట్టు అంచనా. ఏదేమైనా రామ్, భీం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయనున్నారనే అర్థమవుతోంది.

 

click me!