దాని గురించి అడిగిన అభిమానికి మల్లికా దిమ్మతిరిగే కౌంటర్

Published : Mar 07, 2018, 11:04 AM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
దాని గురించి అడిగిన అభిమానికి మల్లికా దిమ్మతిరిగే కౌంటర్

సారాంశం

మల్లికా దువా అంటే సినిమాలు చూసేవాళ్ళకు అంతగా ఫ్లాష్ కాకపోవచ్చు కాని సోషల్ మీడియా ట్రెండ్స్ ను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకు మాత్రం తను చాలా పాపులర్ తను చేసిన షిట్ పీపుల్ సే అనే వీడియో మల్లికాను ఒక్క రోజులో ఇంటర్నెట్ సెన్సేషన్ గా మార్చింది

మల్లికా దువా అంటే సినిమాలు చూసేవాళ్ళకు అంతగా ఫ్లాష్ కాకపోవచ్చు కాని సోషల్ మీడియా ట్రెండ్స్ ను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకు మాత్రం తను చాలా పాపులర్. కామెడీ ప్లస్ సెటైర్ వీడియోస్ చేయటంలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ కలిగిన మల్లికా దువా ఇన్స్ టాగ్రామ్ స్నాప్ చాట్ డబ్ స్మాష్ లను విపరీతంగా వాడుతుంది. గతంలో తను చేసిన ‘షిట్ పీపుల్ సే: సరోజినీ నగర్ ఎడిషన్’ అనే వీడియో మల్లికాను ఒక్క రోజులో ఇంటర్నెట్ సెన్సేషన్ గా మార్చింది. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా మెండుగా ఉన్న మల్లికా యాక్టివ్ గా ఉంటోంది గత మూడేళ్ళ నుంచే. ప్రముఖ జర్నలిస్ట్ వినోద్ దువా కూతురే ఈ మల్లికా. ఇందులోకి రాకముందు ఒక పత్రికలో కాపీ రైటర్ గా పనిచేసిన ఈ ఆన్ లైన్ బాంబ్ అడ్వర్టైజింగ్ లో మంచి ఎక్స్ పర్ట్. అందుకే తను రెగ్యులర్ గా పోస్ట్ చేసే కామెడీ వీడియోస్ కోసం అభిమానులు ప్రత్యేకంగా ఎదురు చూస్తూ ఉంటారు.

మరి ఇంతగా పాపులర్ అయిన మల్లికా దువాకు మగరాయుళ్ళ నుంచి ఇబ్బందులు ఎదురు కావా అంటే అవుతున్నాయి. కాని వాటిని ఎదుర్కునే తీరు మాత్రం ఓ రేంజ్ లో ఉంటుంది. తనను టార్గెట్ చేసిన ఒకతను ఆన్ లైన్ లో  మల్లికా బ్రాలు వేసుకోకపోవడం గురించి ప్రశ్నించాడు. వెంటనే కోపం తెచ్చుకోకుండా చాలా కూల్ గా నాలో అవి చూస్తున్నప్పుడు మీ వైఫ్ మీ గురించి ఏమనుకుంటారు అని రివర్స్ లో ప్రశ్నించింది. అంతటితో వదిలేస్తే తను మల్లికా ఎందుకు అవుతుంది. అతను చేసిన కామెంట్ ని స్క్రీన్ షాట్ రూపంలో పెడుతూ ఇలాంటి వాళ్ళు ఫాలోయర్స్ గా ఉన్నందుకు అదృష్టవంతురాలినని గట్టి చురకే వేసింది. తన ఫైర్ బ్రాండ్ మార్క్ ని ఇందులో కూడా చూపించిన మల్లికా దువా ధైర్యానికి నెటిజెన్లు ప్రశంశలు కురిపిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే
రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు