Bramayugam Trailer : మమ్ముట్టి ‘భ్రమయుగం’ ట్రైలర్ చూశారా? వెన్నులో వణుకు పుట్టడం ఖాయం!

By Nuthi Srikanth  |  First Published Feb 10, 2024, 11:08 PM IST

మలయాళం స్టార్ నటుడు మమ్ముట్టి (Mammootty) నటించిన హారర్ ఫిల్మ్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. వెన్నులో వణుకుపుట్టించే సన్నివేశాలతో ఆకట్టుకుంటోంది. యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. 
 


మలయాళం బడా హీరో మమ్ముట్టి తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు కలిగి ఉన్నారు. ఆయన నటనకు ఇక్కడా అభిమానులు ఉన్నారు. ‘యాత్ర’ సినిమాతో ఆయనకు టాలీవుడ్ లో మరింత క్రేజ్ దక్కింది. ఆయన చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అఖిల్ ‘ఏజెంట్’ చిత్రంలో ఇంపార్టెంట్ రోల్ లో నటించిన విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా ‘యాత్ర2’ Yatra 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ పొలిటికల్ డ్రామా థియేలర్లలో రన్ అవుతోంది. 

ఈ క్రమంలో మమ్ముట్టీ మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మలయాళంలో ఆయన ప్రధాన పాత్రలో నటించిన హారర్ ఫిల్మ్ ‘భ్రమయుగం’ Bramayugam రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. మ్ముట్టి, అర్జున్ అశోకన్‌ ఈ హారర్ థ్రిల్లర్ ట్రైలర్ సన్నివేశాలు వెన్నులో వణుకుపుట్టించేలా ఉన్నాయి. భ్రమయుగం : ది ఏజ్ ఆఫ్ మ్యాడ్‌నెస్‌ అనే టైటిల్ వచ్చిన చిత్రానికి రాహుల్ సదాశివన్ రచన, దర్శకత్వం వహించారు. వైనాట్ స్టూడియోస్, నైట్ షిఫ్ట్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. 

Latest Videos

మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించడంతో ఈ సినిమాపై  అత్యంత అంచనాలు ఏర్పడ్డాయి. అందులోనూ తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించేలా ఉన్నాయి. హారర్, థ్రిల్లర్ అంశాలు మూవీపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నాయి. పాత్రల పేర్లను, ఓ భయంకరమైన కథను మాత్రమే వివరించారు. మిగితా రహస్యాన్ని సినిమాలో చూపించబోతున్నట్టు తెలిపారు. ఈ చిత్రం ఫిబ్రవరి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.   

click me!