
విజయ్ కాంత్ పోలిటికల్ ఎంట్రీతో ఆ ప్రభావం రజనీకాంత్ పై పడేలా కనిపిప్తోంది. అటు విశాల్ కూడా పొలిటికల్ స్టాండ్ తీసుకుంటుండటంతో సూపర్ స్టార్ మళ్లీ రీ ఎంట్రీ ఆలోచనలు ఏమైనా ఉన్నాయోమో అన్న అనుమానంతో.. అటు మీడియా కూడా తలైవాను ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఇక ఈ విషయంలో నేను ఒక్క సారి చెబితే వందసార్లు చెప్పినట్టే అంటున్నారు రజినీకాంత్. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..?
రజనీకాంత్ అతిధి పాత్రలో నటించిన లాల్ సలామ్ థియేటర్లలో విడుదలై తమిళ నాట మాత్రమే మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాను రజనీ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించారు. రజనీకాంత్ ఈ సినిమాలో ఓ 40 నిమిషాల అతిధి పాత్రలో నటించారు. మొయిదీన్ భాయ్ పాత్రకు అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దీని తర్వాత రజనీకాంత్ జ్ఞానవేల్ దర్శకత్వంలో వేదతియాన్ మూవీలో నటిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో వేదియన్ షూటింగ్ నిమిత్తం ఆంధ్రప్రదేశ్ వెళ్లేందుకు చెన్నై విమానాశ్రయానికి వచ్చిన రజనీకాంత్ మీడియాతో సమావేశమయ్యారు. లాల్ సలామ్ కు మంచి స్పందన లభిస్తున్నందుకు సంతోషంగా ఉందని, చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు.
ఇక మీడియా ఊరికే ఉండకుండా.. విజయ్ తర్వాత విశాల్ రాజకీయాల్లోకి రావడంపై రజనీని ప్రశ్నించారు. దాంతో రజినీకాంత్ తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చారు. రాజకీయాల గురించి ప్రశ్నలు అడగవద్దని రజనీ కోరారు. సినిమాల గురించి అడగండి చెపుతాను.. నాకు రాజకీయాలతో సంబంధం లేదు అన్నారు. నో పాలిటిక్స్ ఓన్లీ సినిమా అని తెగేసి చెప్పేశారు. ఇక మీడియా తన నెక్ట్స్ సినిమా అప్‌డేట్ గురించి అడిగారు. 80 శాతం షూటింగ్ పూర్తయిందని, ఇంకా 20 శాతం షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని అన్నారు తలైవా.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ రాబోయే 171 వ సినిమాకి సంబంధించిన అప్‌డేట్ గురించి రజనీ స్పందిస్తూ.. ప్రస్తుతం జరుగుతున్న సినిమా షూటింగ్ అయిపోగానే.. తాను లోకేష్ తో చేయబోయే 171వ సినిమా షూటింగ్ ప్రారంభిస్తామన్నారు. రజనీకాంత్ తన తదుపరి చిత్రాల అప్‌డేట్‌ను విడుదల చేయడంతో అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.