షూటింగ్ లో గాయపడ్డ మలయాళ నటుడు, టోవినో థామస్ రెండు కాళ్లకు గాయాలు

Published : Sep 05, 2023, 02:00 PM IST
షూటింగ్ లో గాయపడ్డ మలయాళ నటుడు,  టోవినో థామస్ రెండు కాళ్లకు గాయాలు

సారాంశం

ప్రముఖ మలమాళ నటుడు.. యంగ్ స్టార్  టోవినో థామస్  షూటింగ్ లో గాయపడ్డారు. ఓ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రమాదం జరిగి ఆయన కాళ్ళకు గాయాలు అయినట్టుసమాచారం. ఇంతకీ ఏం జరిగిందంటే..?

ప్రముఖ మలమాళ నటుడు.. యంగ్ స్టార్  టోవినో థామస్  షూటింగ్ లో గాయపడ్డారు. ఓ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రమాదం జరిగి ఆయన కాళ్ళకు గాయాలు అయినట్టుసమాచారం. ఇంతకీ ఏం జరిగిందంటే..?

మలయాళ నటుడు టోవినో థామస్‌ కు గాయాలు అయ్యాయి. నడిగర్‌ తిలకం సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలో జరిగిన ఓ ప్రమాదంలో ఆయన లో గాయపడ్డాడు. డ్రైవింగ్‌ లైసెన్స్‌ సినిమాతో స్టార్ గా మారిన దర్శకుడు లాల్‌ జూనియర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పెరంబవూరు సమీపంలోని మారంపల్లిలో షూటింగ్‌ జరుపుకుంటుంది. ఈ షూటింగ్‌లో ప్రమాదవశాత్తు టోవినో థామస్‌ రెండు కాళ్లకు గాయాలయ్యాయి. 

అయితే ప్రమాదం జరిగిన వెంటనే ఆయన్ను మూవీ టీమ్ వెంటనే హాస్పిటల్ కు తరలించారు. అక్కడ నిపుణులైన డాక్టర్లు థామస్ ను అన్నిరకాలుగాపరీక్షించారు.. ఆయనకు మేజర్‌గా గాయాలు కాలేవని, ఓ వారం వరకు రెస్ట్‌ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్‌ చెప్పినట్టు తెలుస్తోంది.  ఇక వారం తర్వాతే సినిమా షూటింగ్‌ మళ్లీ మొదలు కానుందని దర్శకుడు కూడాక్లారిటీ ఇచ్చాడు. 

రెండేళ్ల కిందట వచ్చిన మిన్నల్‌ మురళీ సినిమాతో టోవినో థామస్‌కు తెలుగులో మంచి పాపులారిటీ వచ్చింది. అప్పటి నుండి ఆయన సినిమాలను తెలుగు ప్రేక్షకులు విపరీతంగా ఆధరిస్తున్నారు. ఇటీవలే రిలీజైన 2018 సినిమా కూడా తెలుగులోమంచి రెస్పాన్స్ సాధించింది. టోవినో థామస్‌కు  టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్‌ ఇప్పుడిప్పుడే వస్తోంది. ప్రస్తుతం ఆయన నటించిన ఏఆర్‌ఎమ్‌ రిలీజ్ కు రెడీగా ఉంది. మలయాళంతో పాటు.. ఈసినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.  భారీ ఎత్తున రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.

ఇక లాల్‌ జూనియర్ తెరకెక్కిస్తున్న నడిగర్‌ తిలకం సినిమా కూడా పాన్‌ ఇండియా లెవల్లో తెరకెక్కుతుంది. పైగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటి బంపర్ హిట్ తర్వాత లాల్‌ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో సినీ ప్రియుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. షోబిన్‌ షాహీర్, షైన్‌ టామ్ చాకోలు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది స్టార్టింగ్ లో రిలీజ్ కాబోతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌
అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే