
సినిమా లెక్కలు ఈ మధ్యకాలంలో బాగా మారిపోయాయి. కేవలం టీజర్,ట్రైలర్, గ్లింప్స్ ఇవే సినిమా భవిష్యత్ ని డిసైడ్ చేస్తున్నారు. అవి ఏ మాత్రం తేడా కొట్టినా లోపల ఎంత గొప్ప కంటెంట్ ఉన్నా జనం పట్టించుకోవటం లేదు. బిజినెస్ సైతం చప్పగా సాగుతోంది. అయితే అదే అదిరిపోయే మేటర్ తో కేవలం గ్లింప్స్ వదిలినా చాలు బిజినెస్ దుమ్ము రేగుతుంది. అందుకు #OG సినిమానే ఉదాహరణ.
ప్రభాస్ తో చేసిన ‘సాహో’ తర్వాత దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఓజీ #OG . పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం గ్లింప్స్‌ని రీసెంట్ గా విడుదల చేశారు మేకర్స్. అర్జున్ దాస్ ఓయిస్ ఓవర్ తో ఈ టీజర్ మొదలైంది. పదేళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుపాను గుర్తుందా? అది మట్టి, చెట్లతో పాటు, సగం ఊరిని ఊడ్చేసింది. కానీ… వాడు నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం ఇప్పటికీ ఏ తుఫాను కడగలేకపోయింది. అలాంటి వాడు మళ్లీ తిరిగి వస్తున్నాడు అంటే..’ అంటూ పవన్ ఎంట్రీని చూపించారు. తమన్ నేపథ్య సంగీతం ఈ గ్లింప్స్‌కి బలాన్ని చేకూర్చింది. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్‌కు జోడిగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. ఈ ఓజీ గ్లింప్స్ ఓ రేంజిలో వైరల్ అయ్యాయి. దాంతో సినిమా కు ఎక్కడలేని హైప్ ఒక్కసారిగా ట్రేడ్ లో క్రియేట్ అయ్యింది.
దాంతో ఈ సినిమా ఓవర్ సీస్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. అందుతున్న సమాచారం మేరకు నిర్మాత డీవీవీ దానయ్య ఓవర్ సీస్ రైట్స్ నిమిత్తం 20 కోట్ల రూపాయలు పైగా కోట్ చేసారు. అయితే @PharsFilmవారు రూ. 13 కోట్లకు ఫైనల్ చేసి సొంతం చేసుకుందని టాక్. అంటే ఓవర్ సీస్ లో బ్రేక్ ఈవెన్ రావాలంటే ..సుమారు 3 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేయాలన్నమాట. స్ట్రాంగ్ కంటెంట్, టెక్నికల్ వేల్యూస్ ఆ పని ఈజీగా చేసేస్తాయి.