
స్టార్ హీరోలు, స్టార్ డైరక్టర్స్ సినిమాలు చుట్టూ ఎప్పుడూ ఏదో ఒక వార్త లేదా రూమర్ ప్రచారం లోకి వస్తూనే ఉంటుంది. తాజాగా అలాంటి రూమర్ లాంటి వార్త ఒకటి రాజమౌళి, మహేష్ బాబు సినిమాని బేస్ చేసుకుని ప్రచారంలోకి వచ్చింది. అయితే ఆ వార్తలో నిజమెంతో కానీ సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజిలో హాట్ టాపిక్ గా మారిందనటంలో మాత్రం సందేహం లేదు. ఇంతకీ ఏమిటా వార్త అంటే...
రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రూపొందబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం SSMB29.గత కొంతకాలంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్కు జరుగుతోంది. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ రాస్తూ మెరుగులు దిద్దుతున్నారు. మరో ప్రక్కన మహేష్ బాబు, తను త్రివిక్రమ్ తో చేస్తున్న గుంటూరు కారం ఫినిష్ చేసుకుని ఇటు వద్దామనే ఆత్రుతలో ఉన్నారు. ఈ మేరకు ఆయన జిమ్ లో కష్టపడుతున్నారు కూడా. అయితే ఈ ప్రాజెక్టు పూజ కార్యక్రమాలు మాత్రం జరగలేదు. ఎప్పటినుంచి అఫీషియల్ గా మొదలు కానుందనే విషయమై క్లారిటీ లేదు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓపినింగ్ లేటు అవుతుందనే వార్తలు వస్తున్నాయి. అలాగే ఈ చిత్రం పూజ,షూట్ కావాలనే వాయిదా వస్తున్నారనే రూమర్ ఊపందుకుంది.
ఆ రూమర్ సారాంశం ఏమిటంటే...రాజమౌళి ప్రతి సినిమాకు.. కీరవాణిగారు తను దైవంగా కొలిచే జ్యోతిష్యుడుతో సంప్రదింపులు జరిపి.. రాజమౌళి జాతకాన్ని చూపించి మరీ సినిమా మొదలుపెడతారట. కర్ణాటకలో ఉండే ఆ జ్యోతిష్యుడు మాటను రాజమౌళి వేదవాక్కుగా అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా కర్ణాటక వెళ్లి.. కీరవాణి, రాజమౌళి జాతకాన్ని చూపించగా.. ప్రస్తుతం ఆయనకు బ్యాడ్ లక్ నడుస్తుంది అని చెప్పారట. ఈ ఏడాది ఎలాంటి కొత్త సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లకూడదని, అలా చేస్తే సినిమాపై గ్రహాల చెడు ప్రభావం నడుస్తోంది అని చెప్పారట.దాంతో రాజమౌళి- మహేష్ కాంబోలో వస్తున్న SSMB29 కనీసం పూజను కూడా జరుపుకోలేదని అంటున్నారు.
వచ్చే ఏడాది ఆగస్టు వరకు ఇలాగే అలానే ఉంటుందని, ఆగస్టు తరువాత గ్రహాలు అనుకూలిస్తాయని.. అప్పుడే SSMB29 మొదలుపెట్టమని చెప్పినట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఈ మేటర్ లో ఎంతవరకూ నిజముందో కానీ ... సోషల్ మీడియాలో మాత్రం తెగ రచ్చ అవుతోంది. ఇక SSMB29కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ త్వరలో కంప్లీట్ అవుతుందని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ సినిమాలో కావాల్సినంత థ్రిల్, అంతకు మించి ఎమోషన్ ఉంటుందన్నారు. స్క్రిప్టు పూర్తయ్యాక, కనీసం 6 నెలల పాటు ప్రీ ప్రొక్షన్ పనులు కొనసాగే అవకాశం ఉందన్నారు. కాబట్టి జాతకాలు ప్రక్కన పెట్టినా ఖచ్చితంగా అన్ని కుదరి పట్టాలు ఎక్కాలంటే లేటు అయితే అవుతుంది. అలాగే దేవుడు, జ్యోతిష్యం, గ్రహాలు వంటివి రాజమౌళి నమ్మరని చెప్తారు. కాబట్టి ఇది రూమర్ అయ్యే అవకాసం ఎక్కువ.