
‘కొత్త బంగారు లోకం’తో తన కేరీర్ ను ప్రారంభించిన సయ్యద్ సోహెల్ రియాన్ పలు సూపర్ హిట్ చిత్రాల్ లో ఆయా పాత్రలను పోషించారు. నటన పరంగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు (Bigg Boss Telugu) సీజన్ 4లో ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. తన వ్యక్తిత్వంతో ఆడియెన్స్ లో మంచి గుర్తింపు పొందాడు. అలాగే నటనలోనూ మెపిస్తున్న సోహెల్ బిగ్ బాస్ తర్వాత వరుసగా సినీ ఆఫర్లను అందుకుంటున్నాడు. ఇప్పటికే మిస్టర్ ప్రెగ్నెంట్ (MR. Pregnent)తో వచ్చిన సోహెల్.. ఇటీవల తన మరో చిత్రం ‘బూట్ కట్ బాలరాజు’ను అనౌన్స్ చేశాడు.
వరుస షూటింగ్ లతో బిజీగా ఉన్న యంగ్ హీరో తను నటిస్తున్న మరో చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’ నుంచి సోహెల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని గతంలోనే ప్రకటించారు. దత్తాత్రేయ మీడియా పతాకంపై బిగ్ బాస్ ఫెమ్ సోహైల్, మోక్ష జంటగా ఎ.ఆర్ అభి దర్శకత్వంలో హరిత గోగినేని నిర్మిస్తున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న చిత్రం Lucky Lakshman. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ ఫస్ట్ లుక్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ప్రముఖ దర్శకుడు అనిల్ రావి పూడి (Anil Ravipudi) హాజరై ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ‘లక్కీ లక్ష్మణ్’ ఫస్ట్ లుక్ చాలా బాగుందని దర్శక, నిర్మాతలతో పాటు టెక్నికల్ టీమ్ ను అభినందించారు. నటుడు సోహైల్ బిగ్ బాస్ నుండి తనకు తెలుసునని చెప్పాడరు. ఆయన నటన చాలా బాగుంటుందన్నారు. వీరి ముగ్గురు కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ పోస్టర్ లో సోహెల్ గ్రాండ్ లుక్ ను సొంతం చేసుకున్నాడు. ఓ కుర్చీలో స్టైలిష్ సూట్ ధరించి, చేతిలో ఇండియన్ కరెన్సీని పట్టుకొని న్యూ లుక్ ను ప్రజెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.
హీరోహీరోయిన్లుగా సోహెల్, మోక్ష నటిస్తున్నారు. ఆయా పాత్రల్లో దేవి ప్రసాద్, రాజా రవీంద్ర, సమీర్, కాదంబరి కిరణ్, షాని సాల్మన్, అనురాగ్, అమీన్, శ్రీదేవి కుమార్, మాస్టర్ రోషన్, మాస్టర్ అయాన్, మాస్టర్ సమీర్, మాస్టర్ కార్తికేయ, ఝాన్సీ, రచ్చ రవి , జబర్దస్త్ కార్తిక్ , జబర్దస్త్ గీతు రాయల్ కామెడీ స్టార్స్ ఫేమ్ యాదం రాజు తదితరులు నటిస్తున్నారు. చిత్రానికి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ ను ఏఆర్ అభి అందిస్తున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారు. సినిమాటోగ్రాఫర్ – ఐ. ఆండ్రూ, ఎడిటర్ – ప్రవీణ్ పూడి, పాటలు – భాస్కరభట్ల, కొరియోగ్రాఫర్ – విశాల్,
ఆర్ట్ డైరెక్టర్ గా చరణ్ వ్యవహరిస్తున్నారు.