కోట్లు సంపాదించేవాడిని... నటుడు శివాజీ వ్యాఖ్యలపై నెటిజన్ల ట్రోల్స్!

Published : Jul 07, 2022, 02:34 PM IST
కోట్లు సంపాదించేవాడిని... నటుడు శివాజీ వ్యాఖ్యలపై నెటిజన్ల ట్రోల్స్!

సారాంశం

నటుడు శివాజీ వ్యాఖ్యలపై నెటిజెన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. సినిమాల్లో ఉంటే కోట్లు సంపాదించే వాడిని, ఓ సంఘటన సినిమాలకు దూరం చెసిందని చెప్పడంపై నెటిజెన్స్ దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. 

శ్రీవిష్ణు హీరోగా అల్లూరి టైటిల్ తో మూవీ తెరకెక్కింది. ఈ మూవీ ప్రమోషనల్ ఈవెంట్ అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా జులై 4న నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నటుడు శివాజీ సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఓ మాట అన్నారు. నా చివరి సినిమా బూచమ్మ బూచోడు. సినిమాను వదిలేయకుండా ఉండి ఉంటే ఈ పదేళ్లలో వరస్ట్ లో వరస్ట్ రూ. 10-15 కోట్లు సంపాదించేవాడిని. కానీ పాలెం బస్సు సంఘటన నన్ను కలచివేసింది. సినిమాలకు దూరం చేసింది అన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఆ వేదికగా పొలిటికల్ స్పీచ్ ఇవ్వాలని ఆశించారు. మరీ లోతులకు వెళ్లకుండా పై పైన టచ్ చేసి వదిలేశారు. 

ఇక సినిమాల్లో ఉంటే కోట్లు సంపాదించేవాడిని అన్న డైలాగ్ నెటిజెన్స్ ని ఆకర్షించింది. ఇక అందరూ ట్రోల్స్ షురూ చేశారు. నువ్వు ఏమంత పెద్ద స్టార్ అని కోట్లు సంపాదించేవాడివి. సినిమాలు లేక పొలిటికల్ టర్న్ తీసుకున్న నీవు కావాలని సినిమా మానేశా అంటే నమ్మాలా అని ఎద్దేవా చేస్తున్నారు. పొలిటికల్ ప్యాకేజ్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నావని ఎద్దేవా చేస్తున్నారు.  

కెరీర్ ఫేడ్ అవుట్ దశకు చేరుకుంటున్న సమయంలో శివాజీ తెలివిగా పొలిటికల్ టర్న్ తీసుకున్నారు. అప్పటి బీజీపీ, టీడీపీ ప్రభుత్వాలు, అమరావతి కాపిటల్ వంటి విషయాలు చర్చిస్తూ ప్రెస్ మీట్స్ పెట్టాడు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబును విమర్శించాడు. ఇక గరుడపురాణం అంటూ ఓ పెద్ద కుట్ర జరుగుతుందని రచ్చ చేశాడు. సడన్ గా వర్షన్ మార్చి చంద్రబాబు టీమ్ లో కలిసిపోయాడు. ప్రస్తుతం టీడీపీ సానుభూతిపరుడిగా కొనసాగుతున్నాడు. బాబు గారు వస్తేనే ఏపీ భవిష్యత్ అంటూ నినాదం అందుకున్నారు. 

ఎక్కువగా అమెరికాలోనే ఉంటున్న శివాజీ అప్పుడప్పుడూ ఇండియాకు వస్తూ టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పొలిటీషియన్ గా మారాక సినిమాలు పూర్తిగా వదిలేశారు. చిన్న నటుడిగా కెరీర్ మొదలుపెట్టిన శివాజీ మిస్సమ్మ, టాటా బిర్లా మధ్యలో లైలా వంటి చిత్ర చిత్రాల్లో హీరోగా చేశారు.

PREV
click me!

Recommended Stories

850 కోట్లతో యానిమల్‌ కు షాక్ ఇచ్చిన ధురందర్, ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం
1300 కోట్లతో బాక్సాఫీస్ క్వీన్ గా నిలిచిన హీరోయిన్ ఎవరు? 2025 లో టాప్ 5 స్టార్స్ కలెక్షన్లు