
‘‘డబుల్ ది ఎంటర్‌టైన్‌మెంట్! డబుల్ ది యాక్షన్! డబల్ ది మ్యాడ్‌నెస్! వి ఆర్ బ్యాక్ !! చడబుల్‌ఇస్మార్ట్ మోడ్ ఆన్! ‘‘ అంటూ రీసెంట్ గా తమ తాజా చిత్రం లాంచ్ ‘డబుల్ ఇస్మార్ట్’ని లాంచ్ చేసారు. సక్సెస్ ఫుల్ ‘ఇస్మార్ట్ శంకర్’ రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబోలో రూపొందిన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు. రీసెంట్ గా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో మొదలైందీ చిత్రం. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది.
దర్శకుడు పూరి జగన్నాథ్... గతంలో లైగర్ తో డిజాస్టర్ ఇచ్చారు. ఆ సినిమాపై అనేక విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా సినిమా మొత్తం ముంబైలో బ్యాక్ డ్రాప్ లో సెట్ చేసి ఉండటం, షూట్ అక్కడే జరగటం చాలా మందికి నచ్చలేదు. ఈ క్రమంలో సినిమాకు ముందు, తర్వాత ఎక్కువ శాతం ముంబైలోనే పూరి ఉంటూ వచ్చారు. సినిమా రిలీజ్ తర్వాత ఎగ్జిబిటర్స్ సైతం తమకు పూరి అందుబాటులో లేరని, హైదరాబాద్ లో ఉండకుండా, ముంబైలో ఉన్నారని గోలెత్తిపోయారు. అయినా సరే పూరి తను ముంబైలోనే ఉంటూ వచ్చారు. ఇప్పుడు తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’ని సైతం ముంబైలోనే సెట్ చేసారు. దాంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
దర్శకుడితో అసోసియేట్ అవుతున్న స్టంట్ డైరెక్టర్ కెచ్చా కొరియోగ్రఫీలో భారీ సెట్‌లో రామ్ మరియు ఫైటర్స్‌పై భారీ సీక్వెన్స్‌తో టీమ్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించింది. ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జియాని జియానెల్లి పనిచేస్తున్నారు. ఈ వర్కింగ్ స్టిల్‌లో రామ్, చేతిలో బాణసంచా పట్టుకుని ట్రక్కులో కూర్చొని కనిపించాడు. పూరి, కెచ్చా, జియానీలు కూడా చిరునవ్వుతో కనిపిస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ ఉన్నత ప్రమాణాలతో అధిక బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు మేకర్స్.
ఇక డబుల్ ఇస్మార్ట్ పాన్ ఇండియా . ఇది మహా శివరాత్రికి మార్చి 8, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో విడుదల కానుంది. డబుల్ వినోదం, డబుల్ యాక్షన్ అంటూ రామ్ ట్వీట్ చేశారు. ‘‘విస్తృత స్థాయిలో ఉన్న కథని సిద్ధం చేశారు దర్శకుడు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, భారీ బడ్జెట్‌తో చిత్రం రూపొందుతుంది. రామ్ ఇదివరకటి సినిమాని మించిన మాస్ పాత్రలో కనిపిస్తారు. అంచనాలకి దీటుగా ఇది తెరకెక్కుతుంది.’’అని సినీవర్గాలు తెలిపాయి.