
యేడాదిన్నరగా ఊరించి ఊరించి థియేటర్లలోకి వచ్చిన స్పైడర్ బ్లాక్ బస్టర్ అవుతుందనుకుంటే... అంచనాలు అందుకోలేక బోల్తాపడింది. సినిమాపై టాక్ ఎలా వుందంటే... అసలు పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చే పరిస్థితులు లేవు. ఇక స్పైడర్ సినిమా ఫలితం ఇలా ఎందుకు మారాయని ఆలోచిస్తే ఇందుకు కొన్ని కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఈ కారణలేంటో మనం ఓ సారి చూద్దాం.
మహేష్ హీరోయిజం ఎలివేట్ కావాలని కోరుకునే అభిమానులు ఆ పరగా కృషి జరగకపోవడంతో తీవ్రంగా నిరాశ చెందారు. హీరో కేవలం ఓ రూమ్‌లో కూర్చొని మొత్తం ఆపరేషన్ చేసేస్తాడు. దీంతో హీరోయిజం ఎలివేషన్‌కు స్కోప్ లేదు.
సినిమాలో తమిళ ప్లేవర్ బాగా ఎక్కువైంది. ఇది కూడా ఇక్కడ ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. మహేష్ తమిళ సినిమా చేసి దాన్ని ఇక్కడ డబ్బింగ్ చేసినట్లు ఉంది సినిమా. రెండు భాషల్లో సినిమాను షూట్ చేయడంతో రూ.120 కోట్ల బడ్జెట్ సరిగా వాడుకోలేదు. దీంతో వీఎఫ్ఎక్స్ వర్క్ పేవలంగా ఉంది. యాక్షన్ ఎపిసోడ్లు ప్రేక్షకులకి బోర్ కొట్టించాయి.
కథలో హీరో మహేష్‌బాబు క్యారెక్టర్‌ను విలన్ క్యారెక్టర్ ఎస్.జె.సూర్య బాగా డామినేట్ చేశాడు. ఇంటిలిజెన్స్ ఆఫీసర్ అంటే దేశంలో ఎన్నో పెద్ద సమస్యలు డీల్ చేస్తాడన్నది బేసిక్. కానీ ఇక్కడ హీరో ఓ సైకో కిల్లర్ కేస్ డీల్ చేస్తాడు. బేసిగ్గా ఇది మహేష్ రేంజ్‌కు తగ్గ కథ కాదు.
ఈ సినిమాకు రూ.150 కోట్ల బడ్జెట్ పెట్టారు. ఓ థ్రిల్లర్ మూవీకి ఇది చాలా ఎక్కువ. ఏకంగా రూ.156 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగాయి..ఆ అంచనాలు చేరుతుందా.. అదే రూ.90 కోట్ల రేంజ్‌లో అమ్మకాలు చేసి ఉంటే అంచనాలు తక్కువుగా ఉండేవి. మురుగదాస్ ఒక మామూలు సాధారణమైన కథను ఈ సినిమాకు తీసుకోవడం కూడా ప్రధానమైన మైనస్ గా మారింది.
హాలీవుడ్ రేంజ్ సినిమా అంటూ ప్రొజెక్ట్ చేసి మళ్లీ సౌత్ ఇండియన్ రేంజ్ సినిమానే చూపించారు. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే పరిస్థితి కనిపించడం లేదు. స్పైడర్‌ను మాస్, బీ, సీ సెంటర్ల వాళ్ల ను ఆకట్టుకోగలుగుతుందా అనేది సమస్య. దీంతో ఇది కేవలం ఏ క్లాస్, యూత్ వరకు మాత్రమే పరిమితమైంది.