ఫ్యాన్స్ ఆగ్రహం-స్పైడర్ థియేటర్ తగులబెట్టిన అభిమానులు

Published : Sep 28, 2017, 06:12 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
ఫ్యాన్స్ ఆగ్రహం-స్పైడర్ థియేటర్ తగులబెట్టిన అభిమానులు

సారాంశం

స్పైడర్ థియేటర్ తగులబెట్టిన మహేష్ అభిమానులు గుంటూరు జిల్లా వినుకొండలో థియేటర్ దగ్దం స్పెషల్ షో వేయనందుకు నిప్పింటించిన అభిమానులు

ముందు సినిమా చూడాలని రూ.500 పెట్టి టికెట్ కొంటే, రెగ్యులర్ షో టైమ్‌కి సినిమా అంటూ మమ్మల్ని మోసం చేస్తారా అంటూ అభిమానులు ఒక్కసారిగా థియేటర్‌పై దాడి చెయ్యడంతో, థియేటర్ అద్దాలు, సీట్లు, తెర అన్ని దగ్ధం అయ్యాయి.

 

స్పైడర్ మువీ వినుకొండలో వివాదానికి కారణమయ్యింది. దుమారం రేపింది. సూపర్ స్టార్ అభిమానులు వీరంగం చేసే వరకూ సాగింది. గుంటూరు జిల్లా వినుకొండలో ప్రిన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ రెచ్చిపోవడం కలకలం రేపింది. అభిమానుల ఉత్సాహాన్ని క్యాష్ చేసుకోవాలనుకున్న. గుంటూరు జిల్లా వినుకొండలోని ఓ థియేటర్ యాజమాన్యం భారీ నష్టాన్ని చవిచూసింది. థియేటర్ తెరని దగ్ధం చేసే స్థాయిలో అభిమానుల ఆగ్రహానికి గురయింది.

 

తాజాగా రిలీజైన 'స్పైడర్' మూవీ బెనిఫిట్ షో కోసం గుంటూరు జిల్లా వినుకొండకి చెందిన ఓ థియేటర్‌లో ఒక్కో టికెట్‌కి రూ.500 పెట్టి కొనుగోలు చేశారు మహేష్ అభిమానులు. ఈ షో తెల్లవారుజామున 6 గంటలకు పడాల్సి వుంది. కానీ టికెట్స్ అన్నీ అమ్మేసిన తర్వాత 6 గంటలకు కాదు 10 గంటలకు షో అని థియేటర్ యాజమాన్యం తెలపడంతో మహేష్ అభిమానుల ఆవేశం ఒక్కసారిగా భగ్గుమంది.

 

థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసినా, వారు వచ్చే టైంకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పైగా బెనిఫిట్ షో‌కి పర్మిషన్ లేకుండా మీరు టికెట్స్ ఎలా విక్రయించారంటూ పోలీసుకు కూడా థియేటర్ యాజమాన్యంపై యాక్షన్ తీసుకుంటామని చెప్పి అభిమానులకు సర్ది చెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా