
మహేష్ బాబు తన ఫ్యాన్స్ కి గుడ్ చెప్పబోతున్నారు. తాజాగా టైమ్ కూడా ఫిక్స్ చేశారు. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు తన కొత్త సినిమా `ఎస్‌ఎస్‌ఎంబీ28` ని అనౌన్స్ చేయబోతున్నట్టు ప్రకటించారు. మహేష్‌బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కించబోతున్నట్టు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. మే 1న దీన్ని ప్రకటించబోతున్నట్టు వార్తలొచ్చాయి. దీంతో మహేష్ ఫ్యాన్స్ `ఎస్‌ఎస్‌ఎంబీ28` యాష్ ట్యాగ్‌ని ఇండియా వైడ్‌గా ట్విట్టర్‌లో ట్రెండ్ చేశారు.
దీంతో ఎట్టకేలకు చిత్ర బృందం ఈ అప్‌డేట్‌ని ప్రకటించబోతున్నట్టు తెలిసింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై మహేష్‌బాబు హీరోగా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నటరు. తివిక్రమ్ దీనికి దర్శకత్వం వహించనున్నట్టు తెలుస్తుంది. తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ పంచుకున్న వీడియో `అతడు` వీడియో క్లిప్‌ని పంచుకుంది యూనిట్.
ఇదిలా ఉంటే త్రివిక్రమ్.. మహేష్ కంటే ముందు ఎన్టీఆర్‌తో `ఎన్టీఆర్30`ని తెరకెక్కించాల్సి ఉంది. అనుకోని కారణాలతో ఈ సినిమా క్యాన్సిల్ అయ్యింది. ఎన్టీఆర్.. కొరటాలతో తన 30వ సినిమాని ప్రకటించారు. దీంతో త్రివిక్రమ్.. మహేష్‌తో సినిమా చేయబోతున్నట్టు వార్తలు ఊపందుకున్నాయి. అందులో నిజమెంతా అనేది సాయంత్రం నాలుగు గంటలకు తేలనుంది. మరోవైపు త్రివిక్రమ్, మహేష్ కాంబినేషన్‌లో ఇది మూడో సినిమా కానుంది. గతంలో `అతడు`, `ఖలేజా` చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 11ఏళ్ల తర్వాత మరో సినిమా రాబోతుంది. ప్రస్తుతం మహేష్ `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్నారు.