
సూపర్ స్టార్ మహేష్ బాబు 'మహర్షి' సినిమా ప్రమోషన్స్ తో బిజీగా గడుపుతున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా ఆయన్ని 'అవెంజర్స్' సినిమా చూశారా..? అని ప్రశ్నించగా.. దానికి ఆయన తనకి టికెట్లు దొరకడం లేదని.. ఏఎంబీలో టికెట్స్ అడిగితే హౌస్ ఫుల్ అయ్యాయని చెబుతున్నారని తనదైన స్టైల్ లో ఆన్సర్ చేసి నవ్వించారు.
మొత్తానికి ఆదివారం నాడు మహేష్ కి టికెట్స్ దొరికినట్లు ఉన్నాయి. ఆదివారం సాయంత్రం సినిమా చూసిన ఆయన అభిమానులతో తన ఎక్స్ పీరియన్స్ ని షేర్ చేసుకున్నారు. ఏఎంబీలో మొదటి సినిమా అంటూ.. సినిమా బాగా నచ్చిందని, ఏఎంబీ ఎక్స్ పీరియాస్ బాగుందని, ఏఎంబీ బృందానికి ధన్యవాదాలు తెలిపారు.
దీనికి సంబంధించిన ఫోటో కూడా షేర్ చేశారు. ఇక 'మహర్షి' సినిమా విషయానికొస్తే.. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని వంశీపైడిపల్లి డైరెక్ట్ చేశారు. మే 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.