ఫ్యాన్స్ కు మెగా హీరో దసరా గిఫ్ట్!

Published : Oct 17, 2018, 03:03 PM IST
ఫ్యాన్స్ కు మెగా హీరో దసరా గిఫ్ట్!

సారాంశం

రామ్ చరణ్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరక్కుతున్న సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బోయపాటి స్టైల్ లో సంక్రాంతికి ఒక ఫుల్ మీల్స్ ఉంటాయని టాక్ వస్తోంది. 

రంగస్థలం సినిమాతో కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న రామ్ చరణ్ నటనలో కూడా రాటు దేలినట్లు నిరూపించుకున్నాడు. డిఫరెంట్ సినిమాలు చేస్తే ఆడియెన్స్ కి మంచి కిక్ ఇవ్వడమే కాకుండా విమర్శకుల నోళ్లకు తాళం వేశాడు. ఇకపోతే నెక్స్ట్ యాక్షన్ మిక్స్ చేసి మాస్ స్టైల్ లో అలరించడానికి మెగాపవర్ స్టార్ సిద్దమవుతున్నాడు. 

రామ్ చరణ్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరక్కుతున్న సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. బోయపాటి స్టైల్ లో సంక్రాంతికి ఒక ఫుల్ మీల్స్ ఉంటాయని టాక్ వస్తోంది. ఇకపోతే ఈ దసరాకి ఎదో ఒక స్పెషల్ ఉండాలి కదా. అందుకే ఫ్యాన్స్ కు చరణ్ ఒక గిఫ్ట్ ప్లాన్ చేస్తున్నాడు. సినిమా టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయ్యాడట.

సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ ఇంకా ఏ మాత్రం ఉపందుకోలేదు. అందుకే దసరా టైమ్ లో అభిమానులకు ఒక తీపి కబురు చెప్పాలని అనుకుంటున్నాడు. ఇకపోతే సినిమాకు వినయ విధేయ రామ అనే టైటిల్ ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ ఎమోషన్ తో పాటు యాక్షన్ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను అలరిస్తాయట. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా రిలీజ్ కానుంది. 

PREV
click me!

Recommended Stories

Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్
Bigg Boss Telugu 9 Elimination: బిగ్‌ బాస్‌ ఎలిమినేషన్‌లో బిగ్‌ ట్విస్ట్.. 13 వారం ఈ కంటెస్టెంట్ ఔట్‌