తండ్రి కృష్ణ బర్త్ డే స్పెషల్‌.. స్వగ్రామ ప్రజలకు మహేష్‌ కరోనా టీకాలు

Published : May 31, 2021, 04:40 PM IST
తండ్రి కృష్ణ బర్త్ డే స్పెషల్‌.. స్వగ్రామ ప్రజలకు మహేష్‌ కరోనా టీకాలు

సారాంశం

నేడు (మే 31) తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణపుట్టిన‌రోజు సందర్భంగా బుర్రిపాలెం ప్రజల కోసం కోవిడ్ -19 టీకాల పూర్తి డ్రైవ్‌ను స్పాన్సర్ చేశారు మహేష్ బాబు.

సూప‌ర్‌స్టార్ కృష్ణ పుట్టిన‌రోజు సందర్భంగా తన సొంత గ్రామమైన బుర్రిపాలెం ప్రజలకు కోవిడ్ -19 టీకాలు వేయించారు మహేష్ బాబు. మహేష్ తన స్వగ్రామం బుర్రిపాలెంని దత్తత తీసుకుని తనవంతు సేవలు అందిస్తున్న విష‌యం తెలిసిందే. కేవ‌లం బుర్రిపాలెం వాసుల‌కే కాదు మ‌హేష్ తనవంతు సామాజిక కార్యక్రమాల్ని నిరంతరం చేస్తూనే ఉన్నారు. ఇప్ప‌టికే ఆంధ్రా హాస్పిటల్స్ తో కలిసి 1000 మందికి పైగా పిల్లలకు గుండె ఆపరేషన్ చేయించారు. హీల్ ఎ చైల్డ్ ఫౌండేషన్` సంస్థతో కలిసి ఆర్థిక అండదండలు లేక వైద్య ఖర్చులను భరించలేని ఎంతో మంది చిన్నారుల కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు.

నేడు (మే 31) తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణపుట్టిన‌రోజు సందర్భంగా బుర్రిపాలెం ప్రజల కోసం కోవిడ్ -19 టీకాల పూర్తి డ్రైవ్‌ను స్పాన్సర్ చేశారు మహేష్ బాబు. వ‌రుస‌గా ఏడు రోజుల‌పాటు ఈ డ్రైవ్ కొన‌సాగ‌నుంది.  అలాగే ఆంధ్రప్రదేశ్‌లో బుర్రిపాలెం, తెలంగాణలోని సిద్ధాపురం గ్రామాలను దత్తత తీసుకున్నారు మ‌హేష్‌. ఆ గ్రామాల్లో కొన్ని ముఖ్యమైన ప్రదేశాలను అభివృద్ధి చేసే బాధ్యతలను స్వీకరించడం ద్వారా శ్రీమంతుడిగా నిరూపించుకుంటున్నారు. తన తండ్రి కృష్ణ పుట్టినరోజున మహేష్ ఆంధ్ర హాస్పిటల్స్ సహకారంతో బుర్రిపాలెం గ్రామస్తులకు కోవిడ్ -19 టీకాల పూర్తి డ్రైవ్ ను స్పాన్సర్ చేశారు. 

`టీకా అనేది మ‌ళ్లీ మనం సాధార‌ణ జీవితం గడపడానికి ఆశాకిర‌ణం లాంటిది. బుర్రిపాలెం ప్ర‌జ‌లు ప్ర‌తి ఒక్క‌రు టీకా వేసుకుని క్షేమంగా ఉండడానికి ఇది నా వంతు ప్ర‌య‌త్నం. ఈ టీకా డ్రైవ్‌ను ఏర్పాటు చేయడంలో మాకు సహాయపడినందుకు ఆంధ్రా హాస్పిటల్స్‌కు కృతజ్ఞతలు. ఈ క్లిష్ట కాలంలో 'టీమ్ మహేష్ బాబు స‌భ్యులు` స్వచ్చందంగా ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించడం అభినందించాల్సిన విషయం. టీకా యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుని వేయించుకోవడానికి ముందుకు వచ్చిన గ్రామస్తులందరినీ అభినందిస్తున్నాను. టీకా వేయించుకోండి అందరూ సురక్షితంగా ఉండండి` అని మ‌హేష్ ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

ప్రభాస్‌కి గ్యాప్‌ లేకుండా చేసిన చిరంజీవి.. `మన శంకరవరప్రసాద్‌ గారు` రిలీజ్‌ డేట్‌ ఫిక్స్
Suman Shetty Eliminate: సుమన్‌ శెట్టి ఎలిమినేట్‌.. భరణితో స్నేహం దెబ్బ కొట్టిందా? తనూజ ఆవేదన